మహిళల కన్నీళ్లు తుడిచే బృహత్తర పథకమే ఉజ్వల యోజన పథకం

 

తెలంగాణ విమోచన కమిటీ చైర్మన్ శ్రీవర్ధన్ రెడ్డి
షాద్ నగర్ ఆగష్టు 2  (globelmedianews.com):
 షాద్ నగర్ పట్టణం లోని పటేల్ రోడ్ లో ఉచిత వంట గ్యాస్ పంపిణీ  కార్యక్రమం యువమోర్చా పట్టణ అద్యక్షులు క్యామ మహేష్ ఆద్వర్యం లో  శుక్రవారం  నిర్వహించారు. ఈ  కార్యక్రమానికి తెలంగాణ విమోచన కమిటీ చైర్మన్ శ్రీవర్ధన్ రెడ్డి, ,పట్టణ అద్యక్షులు మల్ చలం మురళి, భాజపా యువ నాయకులు ఆకుల ప్రదీప్ పాల్గొన్నారు.  
మహిళల  కన్నీళ్లు తుడిచే బృహత్తర పథకమే ఉజ్వల యోజన పథకం

శ్రీవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ  మహిళలు ఎవ్వరు కూడ వంట చెరుకు పైన ఎవ్వరు వంట చేసి ఆరోగ్యాన్ని పాడుచేసుకోవద్దనే ఉద్దేశం తో గ్యాస్ లేని ప్రతి కుటుంబానికి ప్రధానమంత్రి గారు ఉజ్వల గ్యాస్ పథకం కింద గ్యాస్ ఇవ్వడం జరుగుతుందని అన్నారు అర్హులైన ప్రతి ఒక్కరు సద్వినియోగ పరుచుకోవాలి పేర్కొన్నారు.కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్లోకి తీసుకపోవడం లో విఫలమైందని అన్నారు. ఎక్కడ  బిజెపి కి ,ప్రధానమంత్రి కి మంచి పేరు వస్తదో అని ప్రజల దగ్గరకు చేరవేస్తలేరని అన్నారు.తెరాస ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చే పరిస్థితి కూడా లేదన్నారు .తెరాస పై ప్రజలు తిరగబడే రోజులు దగ్గర పడ్డాయని అన్నారు.

No comments:
Write comments