. కోచ్ గా సౌరవ్...?

 

ముంబై, ఆగస్టు 3, (globelmedianews.com - Swamy Naidu)
భారత క్రికెట్ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తన మనస్సులో మాట బయటపెట్టాడు. ఎప్పటికైనా టీమిండియాకు తాను కోచ్ గా బాధ్యతలు చేపడతానని ప్రకటించారు. భవిష్యత్తులో తప్పకుండా కోచ్ పదవి కోసం తాను దరఖాస్తు చేసుకుంటానని గంగూలీ అన్నారు.
 కోచ్ గా సౌరవ్...?
 అయితే ప్రస్తుతం తాను బెంగాల్ క్రికెట్ సంఘం చైర్మన్ గానూ, అలాగే కామెంటేటర్, ఐపీఎల్ బాధ్యతలతో బిజీగా ఉన్నానని, అయితే ఎప్పటికైనా  కోచ్ పదవి కోసం తప్పకుండా ప్రయత్నం చేస్తానని గంగూలీ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే టీమిండియా కోచ్ పదవి కోసం ఇప్పటికే దాదాపు 2000 వరకూ అప్లికేషన్లు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ప్రస్తుత టీం కోచ్ రవిశాస్త్రినే మళ్లీ కొనసాగించే అవకాశం లేకపోలేదనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే దరఖాస్తు చేసుకున్న వారిలో టామ్ మూడీ, జాంటీ రోడ్స్ లాంటి వారు ఉండటం గమనార్హం.

No comments:
Write comments