సమాజానికి కళ్ళకు కట్టినట్లు చూపేది చిత్రమే

 

కర్నూలు, ఆగస్టు 19 (globelmedianews.com - Swamy Naidu)
సమాజానికి కళ్ళకు కట్టినట్లు చూపేది చిత్రమేనని జిల్లాలో మంచి ఫోటోగ్రాఫర్లు ఉన్నారని జిల్లా కలెక్టర్ జి. వీరపాండియన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ ఆవరణలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని మీడియా ఫోటోగ్రాఫర్లు ప్రదర్శించిన ఫోటో ఎగ్జిబిషన్ ను జిల్లా యస్.పి కె. ఫకీరప్పతో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఉత్తమ ఫోటోగ్రాఫర్లు ఉన్నారని అభివృద్ధి కార్యక్రమాలు, ఇతర అన్ని అంశాలతో కూడిన ఫోటోలు ఎగ్జిబిషన్ లో ప్రదర్శన ఇచ్చారని కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేసారు. 
 సమాజానికి కళ్ళకు కట్టినట్లు చూపేది చిత్రమే
సమాచారం ఇచ్చే వాక్యాన్ని కన్నా ఫోటో కళ్లకు కట్టినట్టు ఉంటుందన్నారు. ఎస్.పి. ఫకీరప్ప మాట్లాడుతూ అన్ని కాంబినేషన్ లతో మంచి ఫోటోలు ప్రదర్శనలో ఉన్నాయని ప్రశంసించారు. అంతకు ముందు ఫోటో కెమెరాను కనిపెట్టిన లూయీస్ దగోరే చిత్ర పటానికి పూలమాల వేసి జ్యోతి వెలిగించి ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ విధే ఖరే కూడా పాల్గొన్నారు.

No comments:
Write comments