సంక్షేమ పథకాలకు పెద్ద పీట

 

రంగారెడ్డి  ఆగష్టు24 (globelmedianews.com - Swamy Naidu)
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం కుమ్మరి గూడెంలో  శనివారం మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, చేమకూర మల్లారెడ్డి పర్యటించారు.  ఈ కార్యక్రమంలో  జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ అనితా రెడ్డి, ఎంఎల్ఏ యాదయ్య  ఎంఎల్సీ పట్నం మహేందర్ రెడ్డి,  జెడ్పీటీసీ పట్నం అవినాష్ రెడ్డి, ఎంపీపీ ప్రశాంతి రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, సర్పంచ్ కేతన రమేష్ తదితరులు పాల్గోన్నారు.  పర్యటనలో భాగంగా రూ. 66 లక్షల బీటీ రోడ్డు పనులను ప్రారంభించి, హరిత హారం మొక్కలను మంత్రులు  నాటారు.  మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ దేశం లో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు సాగుతున్నాయి. రాష్ట్రంలో మహిళా వికాసం లో భాగంగా డ్వాక్రా మహిళలకు ప్రతీ ఒక్కరికీ రూ. 3 లక్షల రూపాయలు రుణాలు గా ఇస్తాం.  
సంక్షేమ పథకాలకు పెద్ద పీట
సదరు మహిళ దురదృష్టం కొద్ది మృతి చెందిన పక్షం లో పూర్తి రుణ మాఫీ తో పాటు, అదే మొత్తం లో బీమా వర్తిస్తుంది. రాష్ట్రంలో లో గ్రామీణ ప్రాంతాలలో మౌలిక సదుపాయాల కల్పన కోసం రోడ్లు వేస్తున్నం. ప్రభుత్వం చేపట్టిన 60 రోజుల కార్యక్రమంలో ముందుగా చెట్లు నాటి 85 శాతం బతికి, గ్రామానికి పారిశుధ్యం పనులు చేపడితే ఎన్ని నిధులైనా అందించేందుకు కృషి చేస్తాం. మహిళా లోకం కన్నీటి కష్టాలను మిషన్ భగీరథ తో శాశ్వతంగా పరిష్కారం చేసిన ఘనత సీఎం కేసీఆర్ దే. హరిత హారం, మంచినీటి సరఫరా లో నిర్లక్ష్యం చేస్తే అధికారుల మీద వేటు తప్పదని అన్నారు. మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి దూసుకు పోతుంది. ప్రతీ ఎకరాలకు సాగునీరు, విద్యుత్ అందించి సస్యశ్యామలం చేస్తామని అన్నారు. ఎమ్మెల్సీ. మహేందర్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ దేశానికి ఆదర్శంగా నిలిచారు. వెనుకబడిన జిల్లాల్లో జిల్లా లో మరింత అభివృద్ధి కోసం మంత్రులకు అండగా నిలుస్తామని అన్నారు.

No comments:
Write comments