త్వరలోఓమాన్,బహరైన్ దేశాలలో బిజెపి సమావేశాలు: రామచంద్రరావు

 

దుబాయ్ ఆగష్టు 16 (globelmedianews.com)
తెలంగాణ గల్ఫ్ ప్రవాసీ భారతీయ కార్యకర్తల సమావేశం దుబాయ్ లో జరిగింది. ఈ సమావేశానికి ముక్యఅతిథిగా తెలంగాణ భాజపా నాయకులు, ఎం.ఎల్.సి, ఎన్. రామచంద్రరావు హాజరైనారు.. దుబాయ్ మరియు ఒమన్ ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. భాజపా గల్ఫ్ ఎన్.ఆర్.ఐ సమన్వయ కమిటీ ఛైర్మన్ శ్రీ తోపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహింపబడింది. 
త్వరలోఓమాన్,బహరైన్ దేశాలలో బిజెపి సమావేశాలు: రామచంద్రరావు

నరేంద్ర పన్నేరు , కన్వీనర్ – భాజపా మిడిల్ ఈస్ట్ , మరియు ప్రాంతీయ కార్యకర్తలు, పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వీసా .ఎన్.ఆర్.ఐ పాలసీ సంబంధిత సమస్యల గురించి రామచంద్ర రావు వివరించారు. తోపల్లి శ్రీనివాస్ గల్ఫ్ దేశాల కన్వీనర్ ల పేర్లు ప్రకటించారు. భాజపా లోకి గల్ఫ్ దేశాలలో మెంబర్ షిప్ల ను పెద్ద ఎత్తున చేస్తున్నామని చెప్పారు. త్వరలోనే ఇటువంటి కార్యక్రమాలు తెలంగాణ నాయకుల ఆశీర్వాదంతో ఓమాన్ మరియు బహరైన్ దేశాలలో కూడా నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమాలను మగిలిన దేశాల కన్వీనర్లతో కలిసి పని చేసి విజయవంతం చేస్తామని నరేద్ర పన్నేరు తెలిపారు.

No comments:
Write comments