నట్టింట్లో ఉల్లి ఘాటు

 

హైద్రాబాద్, ఆగస్టు 26, "(globelmedianews.com - Swamy Naidu)
వంటింటిల్లో ఉల్లి మంట మండుతుంది. నిత్య అవసరాలల్లో ఉల్లి అతి ప్రధానమైంది. ఇటీవల కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో ఏకధాటి వర్షాలు, వరదలతో నెల రోజుల వ్యవధిలో ఉల్లి ధరలు వినియోగదారులను చుక్కలు చూపిస్తున్నాయి. ఉల్లి ధరలు సామాన్యుడిని సతమతం చేస్తున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటకలో వరదలు ముంచెత్తడంతో ఉల్లి సరఫరా ఒక్కసారిగా పడిపోయింది. దీంతో కిలో ఉల్లిగడ్డ హోల్ సేల్ మార్కెట్లో రూ.30లు పలుకుతోంది. అదే రిటైల్ మార్కెట్లో అయితే ఉల్లిపాయ ధర కిలో రూ.40 పైచిలుకే పలుకుతున్నాయి. ఉల్లిధరలు అమాంతం పెరిగిపోవడంతో వినియోగదారులు లబోదిబోమంటున్నారు. ముఖ్యంగా మహారాష్ట్రలోని పూనే నుంచి రావాల్సిన ఉల్లి లోడ్ వాహనాలు అక్కడే నిలిచిపోవడంతో ఈ సమస్య ఉత్పన్నమైందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. 
 నట్టింట్లో ఉల్లి ఘాటు
ముఖ్యంగా వరదలతో కర్ణాటక, మహారాష్ట్రల్లో రోడ్లు నష్టపోవడం కూడా కారణంగా భావిస్తున్నారు. దీంతో వివిధ ప్రాంతాల నుంచి మహారాష్ట్రలోని ప్రధాన పట్టణాలకు చేరాల్సిన ఉల్లిపాయలు వ్యవసాయ క్షేత్రాల వద్దనే నిలిచిపోతున్నాయి.ప్రస్తుతం హాల్ సెల్ మార్కెట్‌లో కిలో రూ.30 నుంచి రూ.35 పైగా పలుకుతుంది. వారం రోజుల క్రితం హోల్ సెల్ మార్కెట్‌లో రూ.100కి ఐదు కిలు లభిస్తుండగా, నేడు రూ.100కు మూడు కిలోలు మాత్రమే లభిస్తుందని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హాల్ సెల్ మార్కెట్ ధర ప్రభావం మూలంగా  ఏకంగా సాధారణ రిటేల్ దుకాణాల్లో కిలో ఉల్లి గడ్డలు రూ.36 నుంచి రూ.40 పైగా ధరలు నమోదైయ్యాయి. రాబోవు రోజుల్లో కిలో రిటేల్ మార్కెట్‌లో ఉల్లి ధర రూ.50 నుంచి రూ.60కు ఎగబాకే అవకాశం ఉందని ట్రేడ్ మార్కెట్ వ్యాపారులు పేర్కొంటున్నారు. కేవలం వారం రోజుల వ్యవధిలో ఉల్లి ధరలు ఊహించని విధంగా కిలో రూ.12 నుంచి రూ.15 పైగా నమోదు చేసుకున్నాయి. మరో వైపు రెండు రోజుల 
వ్యవధిలో ఏకంగా ధరలు రెట్టింపుగా నమోదు కావడం సర్వత్రా ఆందోళన కరంగా మారింది. హైదరాబాద్‌లోని ప్రధాన హాల్ సెల్ మార్కెట్‌లైన మలక్‌పేట్, మీరాలం మండి తదితర మార్కెట్‌లో ఉల్లి గడ్డ కిలో రూ.30 నుంచి రూ.35 పైగా పలుకుతుంది.వారం రోజుల క్రితం ఇక్కడ కిలో ఉల్లి రూ. 12 నుంచి రూ.20లు ఉండగా, నేడు రెట్టింపు కావడం మూలంగా వినియోగదారులు లబోదిబోమంటున్నారు. ఇటీవల కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలలో కురిసిన వర్షాల -వరుదల మూలంగా ఓవైపు సాగు, మరో వైపు సరఫరా పై తీవ్ర ప్రభావం పడిందని హాల్ సెల్ వర్తకులు పేర్కొంటున్నారు. గత 15 రోజులుగా ప్రధానంగా మహారాష్ట్రలోని అతి పెద్ద ఉల్లి మార్కెట్ కేంద్రమైన పూనా,బెంగూళూర్ నుంచి దిగుమతి భారీగా తగ్గింది. ఇక్కడి నుంచి రవాణా జరగాల్సిన సరుకు వర్షాలు, వరదల మూలంగా అస్తవ్యస్తంగా మారిందిని హోల్ సెల్ వ్యాపారులు వాపోతున్నారు. ఇదిలా ఉండగా ఉల్లి సాగులో ప్రధాన భూమిక వహించే మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ఈ ఏడాది ఆశాజనకంగా ఉల్లి సాగు ప్రారంభం కాలేదని సమాచారం. ఇక్కడ జూన్-జూలై మాసాలలో సాధారణంగా 2.5లక్ష పైగా ఎకరాల్లో ఉల్లి సాగు చేయనుండగా, ఈ ఏడాది భారీ వర్షాల మూలంగా 25- 30 శాతం పైగా సాగు విస్తీర్ణం పై పడిందని అంచనాలు వెలుబడ్డాయి. రాబోవు రోజుల్లో ఉల్లి సరఫరా డిమాండ్ మేర ఉండదని ట్రేడ్ వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు. మరో వైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూల్, ప్రకాశం తదితర జిల్లాలో వర్షాల మూలంగా ఇంకా పంట సాగు ప్రారంభం కాలేదు. అలాగే రాష్ట్రంలోని పలు జిల్లాలో ప్రధాన పంటంగా ఉల్ల సాగు ఇంకా ఆశించిన మేర ఊపందుకొలేదు. ఓవైపు ఉల్లి పంట సాగు విస్తీర్ణం, దిగుబడి ప్రభావాల మూలంగా స్వల్ప కాలంలో ఉల్లి ఘాటెక్కిందని హాల్ సేల్ వ్యాపారులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా గత రెండు వారాలుగా పూనా ,బెంగుళూర్ తదితర ప్రధాన ఉల్లి సరఫరా మార్కెట్‌ల నుంచి దిగుమతి ఆశాజనకంగా లేదని పలువురు ట్రేడర్స్ వాపోతున్నారు. రాష్ట్రానికి ఇక్కడి నుంచి భారీగా ఉల్లి దిగుమతి అవుతుందని 

No comments:
Write comments