వైసీపీ ప్రభుత్వం దుర్మార్గాలకు పాల్పడుతోంది: దేవినేని ఉమ

 

అమరావతి ఆగష్టు 16 (globelmedianews.com - Swamy Naidu)
ఎలాంటి అనుమతి లేకుండా చంద్రబాబు ఇంటిపై డ్రోన్‌ ప్రయోగించారని మాజీ మంత్రి దేవినేని ఉమ ఆరోపించారు.నాలుగు రోజులుగా..ఆళ్ల రామకృష్ణారెడ్డి చంద్రబాబు ఇంటి చుట్టూ తిరుగుతున్నారని దేవినేని ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఇంటిపై డ్రోన్‌ను ప్రయోగించిన విషయమై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డ్రోన్‌ ప్రయోగించిన వ్యక్తుల దగ్గర ఎలాంటి గుర్తింపు కార్డులు లేవన్నారు. పోలీస్‌ యంత్రాంగం ఏం చేస్తోందని దేవినేని ఉమ ఫైర్ అయ్యారు.
 వైసీపీ ప్రభుత్వం దుర్మార్గాలకు పాల్పడుతోంది: దేవినేని ఉమ 
చంద్రబాబు ఇంటిపైకి వరద వెళ్లేలా కుట్రలు చేస్తున్నారని దేవినేని ఉమ ఆరోపించారు.కృష్ణానది ప్రవాహంపై ముందస్తు చర్యలు తీసుకోలేదని విమర్శించారు. రాజధాని భూముల్లోకి వరద రావాలని కుట్రలు చేస్తున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వం దుర్మార్గాలకు పాల్పడుతోందని దేవినేని ఉమ మండిపడ్డారు. జగన్‌ ప్రభుత్వ 
ఆదేశాలతోనే కిరణ్‌ అనే వ్యక్తి డ్రోన్‌ పంపించారని ఆరోపించారు. 

No comments:
Write comments