లంక గ్రామాల్లో ఎంపీ మంత్రి పర్యటన

 

రాజమహేంద్రవరం ఆగస్టు 5, (globelmedianews.com - Swamy Naidu)
గోదావరి ఉగ్రరూపం దాల్చింది ధవళేశ్వరం వద్ద రెండో  ప్రమాదిక హెచ్చరించక జారీ చేశారు . దీనితో  ముందస్తుగా లంక గ్రామాల్లో   ఎంపీ,మంత్రి పర్యటించారు.పశ్చిమ  గోదావరి జిల్లా  వరద ముంపు ప్రభావిత లంక  గ్రామాలను  నర్సాపురం పార్లమెంట్  సభ్యులు రఘురామకృష్టం రాజు  మరియు  ఆంద్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి  చెరుకువాడ శ్రీరంగనాథరాజు  సందర్శించారు 
 లంక గ్రామాల్లో ఎంపీ మంత్రి పర్యటన
ఆచంట నియోజకవర్గంలో  వశిష్ఠ గోదావరి పరీవాహక  లంక గ్రామాలైన పెద్దమలం లంక , పుచ్చల లంక,రవి లంక, మార్రిముల ,అయోద్యలంక గ్రామాల్లో  పర్యటించి అక్కడున్న ఇబ్బందులను, పరిస్థితులను  ప్రజలను అడిగి తెలుసుకున్నా రు .గోదావరికి వరద ఉధృతి క్రమముగా   పెరుగుతున్న నేపథ్యంలో అధికారులను అప్రమత్తం చేశారు .వరద ఉధృతి పెరిగితే లంక గ్రామ  ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ,నిత్యావసర వస్తువులు,పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి సహాయక చర్యలు చేపట్టాలని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు

No comments:
Write comments