టీటీడీలో విలీనయమయిన గండి వీరాంజనేయ స్వామి ఆలయం

 

కడప, ఆగస్టు 28, (globelmedianews.com - Swamy Naidu)
కడప జిల్లా చక్రాయపేట మండలం లోని గండి వీరాంజనేయస్వామి ఆలయాన్ని  రాష్ట్ర ప్రభుత్వం, దేవాదాయశాఖ ఉత్తర్వుల మేరకు టిటిడిలో విలీనం చేశారు. బుధవారం ఈ కార్యక్రమం జరిగింది. రాయలసీమ జిల్లాల్లో ప్రముఖ పుణ్యక్షేత్రమైన గండి ఆఅయానికి ప్రస్తుతం  . 43,371,153 నగదు, బంగారం 900 గ్రాములు, వెండి 100 కేలు ఉన్నదని అధికారులు తెలిపారు. 
టీటీడీలో విలీనయమయిన గండి వీరాంజనేయ స్వామి ఆలయం
విలీనానికి  సంబంధించిన పత్రాలను ఆలయ సహాయ కమిషనర్ పట్టెం గురుప్రసాద్,  టిటిడి అధికారి డిప్యూటీ ఈవో గోవింద రాజన్, ఎస్టేట్ ఆఫీసర్ విజయసారథి కి అందజేశారు. ఈ కార్యక్రమంలో చక్రాయపేట మండల ఇంచార్జ్ వైయస్ కొండారెడ్డి, ఆలయ సిబ్బంది, వైసీపీ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

No comments:
Write comments