జగన్ ప్రసంగాన్ని తప్పుపట్టిన లోకేష్

 

గుంటూరు, ఆగస్టు 10(globelmedianews.com - Swamy Naidu)
విజయవాడలో డిప్లొమాటిక్ ఔట్ రీచ్ సదస్సు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ బిజినెస్ సమ్మిట్‌లో అమెరికా, ఆస్ట్రేలియా, యూకే, జపాన్, సింగపూర్, కెనడా, కొరియా, ఆస్ట్రియా, పోలాండ్, టర్కీతో సహా 35 దేశాల రాయబారులు, హైకమిషనర్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రధానంగా ఫార్మాస్యూటికల్, ఆటోమొబైల్, స్టీల్, టెక్స్‌టైల్, ఫుడ్‌ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్‌ వంటి రంగాల్లో పెట్టుబడులను ఆహ్వానించడమే లక్ష్యంగా సదస్సు నిర్వహిస్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అవకాశాలను ఆయా దేశాల ప్రతినిధులకు వివరించి పెట్టుబడులను ఆకర్షించే దిశగా అడుగులు వేస్తున్నారు. 
 జగన్ ప్రసంగాన్ని తప్పుపట్టిన లోకేష్
ఈ సదస్సులో ముఖ్యమంత్రి జగన్ చేసిన ప్రసంగాన్ని తప్పుబట్టారు మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రతినిధి నారా లోకేష్. జగన్ గారూ.. ‘మా మీద కోపంతో రాష్ట్రాన్ని తక్కువ చేసి చెప్తున్నారేంటి? మన ఆంధ్రప్రదేశ్ సాధించిన ఘనతల గురించి గర్వంగా చెప్పండి’అంటూ ట్వీట్ చేశారు. @ysjagan గారూ.. మా మీద కోపంతో రాష్ట్రాన్ని తక్కువ చేసి చెప్తున్నారేంటి? మన ఆంధ్రప్రదేశ్ సాధించిన ఘనతల గురించి గర్వంగా చెప్పండి..‘జగన్‌మోహన్‌రెడ్డి గారూ.. డిప్లొమాటిక్‌ ఔట్‌రీచ్‌ సదస్సులో, పెట్టుబడులను ఆకర్షిస్తూ ఇచ్చిన స్పీచ్ లో, మా రాష్ట్రం పేద రాష్ట్రం అని మీరు చెప్పారు. ఎవరైనా మన బలాల గురించి చెప్పి, పెట్టుబడులను ఆకర్షిస్తారు. మా మీద కోపంతో, రాష్ట్రం సాధించిన ప్రగతి చెప్పుకోక పోతే, పెట్టుబడులు రావు’అన్నారు నారా లోకేష్. రాష్ట్రం గురించి గొప్పగా చెప్పుకోవటానికి ఎన్నో ఉన్నాయి జగన్ గారు. ఇలాంటివి చెప్తే నాలుగు కంపెనీలు వచ్చి, పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. ‘ఇవన్నీ మేము సాధించినవని, మీరు చెప్పకుండా, మేము ఇన్ని సీట్లు గెలిచాం, అన్ని సీట్లు గెలిచాం అంటే పెట్టుబడులు రావు’అంటూ చురకలంటించారు. 

No comments:
Write comments