అడ్డూ, అదుపు లేని కల్తీ ఏజెన్సీ గ్రామాలే లక్ష్యం

 

దిలాబాద్, ఆగస్టు 12 (globelmedianews.com - Swamy Naidu)
అదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ గ్రామాల్లోని కల్తీ వస్తువుల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఉట్నూర్, ఇంద్రవెల్లి, నార్నూర్, గాదిగూడ, సిరికొండ మండలాల్లోని పలు గ్రామాల్లో ప్రతి వారం అంగడి జరుగుతుంది. వారం వారం జరిగే సం తల్లో ఆయా గ్రామాల ప్రజలు తమకు సరిపడా వస్తువులను కొనుగోలు చేసుకుంటారు. బియ్యం, ఉప్పు, కారంపొడి, పసుపు, నూనె, మసాలాలు, సబ్బులు, అల్లం, ఉల్లిగడ్డలు, కూరగాయలు, ఇతర తినుబండారాలను కొనుగోలు చేస్తారు. స్థానికుల అవసరాలను అసరా చేసుకుని కొందరు దళారులు ఏజెన్సీ గ్రామాల్లో అక్రమ దందాను కొనుసాగిస్తున్నారు.జిల్లాలో పత్తి పంటలు రైతులు ఎక్కువగా సాగుచేస్తారు. కొందరు వ్యాపారులు పత్తి గింజలతో నూనెను త యారు చేసి ఇతర నూనెలో కలిపి మేలురకమైనఅ నూనె పేరిట విక్రయిస్తున్నారు.
అడ్డూ, అదుపు లేని కల్తీ ఏజెన్సీ గ్రామాలే లక్ష్యం 
డ్రమ్ములు, ఇనుప పీపాల్లో కల్తీ నూనె తయారవుతుంది. జిల్లాలో భారీగా అన్ బ్రాండెడ్ లూజ్ అయిల్‌ను విక్రయిస్తున్నారు. ఏది అసలు, ఏది నకిలీయో తెలియకుండా వ్యాపారులు జాగ్రత్త పడుతున్నారు. కారంలో రంగు కలిపిన పౌడర్ లేదా రంపపు పొట్టు, పసుపులో సైతం ఇతర పదార్థాలను కలిపి విక్రయిస్తున్నారు. రంగు మారకుండా రసాయనాలను కలుపుతున్నారు. మిరియాల్లో బొప్పాయి గింజలు కలిపి విక్రయిస్తున్నారు. ప్రజలు రోజు ఆ రోగ్యం కోసం తినే పండ్ల పక్వానికి సైతం వ్యాపారులు ప్రమాదకరమైన రసాయనాలను వినియోగిస్తున్నారు. అరటి కాయలను పండ్లుగా మార్చడానికి పెద్దడ్రమ్ములు నీళ్లు పోసి అందులో రసాయన పదార్థాలను కలిపి వాటిని ముంచి తీస్తున్నారు. దీంతో ఆకుపచ్చ రంగులో ఉన్న అరటి పండ్లు పసుపుపచ్చ రంగులోకి మారిపోతున్నాయి. కల్తీ వస్తువులను తినడంతో ప్రజలు వివిధ రకాల వ్యాధుల బారిన పడుతారని వైద్యులు అంటున్నారు. సంతలు, గ్రామాల్లోని దుకాణాల్లో విక్రయించే నాసిరకం వస్తువులను కొనుగోలు చేయకుండా నాణ్యమైన ఆహార పదార్థాలను వినియోగించాలని సూచిస్తున్నారు. రైతు బీమా పథకం చ

No comments:
Write comments