ఆర్ ఆర్ బి రోడ్లపై గుంతలు... ఆదమరిస్తే అంతే సంగతులు.... స్పందన లేని అధికారులు

 

వనపర్తి ఆగస్టు 24, (globelmedianews.com - Swamy Naidu)
కోట్ల రూపాయలు వెచ్చించి వేసిన ఆర్ అండ్ బి రోడ్లపై ఎవరు ఇష్టానుసారంగా వారు నడిరోడ్డుపై గుంతలు తీయడం వల్ల వాహనాల వారు పడే ఇబ్బందులు వర్ణనాతీతంగా మారాయి. ఆర్అండ్బి రోడ్డుపై భారీ స్థాయిలో గుంతలు తీయడం వల్ల ద్విచక్ర వాహన దారులు ప్రమాదాల కు గురై ఆస్పత్రి పాల అవుతుండగా లక్షల రూపాయలు  వెచ్చించిన కార్లన్నీ దెబ్బతిని రిపేరు షాపల పాలవుతున్నాయి. ఆర్ అండ్ బి రోడ్ లను ఒకపక్క వ్యవసాయదారులు, మరోపక్క మిషన్ భగీరథ వాళ్లు, ఇంకొక ప్రక్క ప్రాజెక్టుల వాళ్ళు నడిరోడ్డుపై గుంతలు తీయడం వాటిని సరిగ్గా పూడ్చకపోవడంవల్ల ఆర్టీసీ డ్రైవర్లు, కార్ల యజమానులు, ద్విచక్ర వాహన దారులు పడే అవస్థలు అంతా ఇంతా కాకుండా పోయాయి. 
ఆర్ ఆర్ బి రోడ్లపై గుంతలు...ఆదమరిస్తే అంతే సంగతులు....
స్పందన లేని అధికారులు
ఈ పరిస్థితులను నాయకులు, అధికారులు గమనిస్తున్నారే తప్ప ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం ఆశ్చర్యకరంగా ఉందని వారు విమర్శిస్తున్నారు. ఇలా నడిరోడ్డుపై గుంతలు తీసిన సంఘటనలు వనపర్తి జిల్లా కేంద్రం మొదలుకొని నరసింగయపల్లి, తాడిపర్తి, గోపాల్పేట, గోపాల్పేట  పోలికే పహాడ్ అడ్డరోడ్డు, బుద్ధారం తో పాటు అన్ని గ్రామాల మొదట్లో ,చివర్లో ఉన్నాయి. ఇలా ఈ గుంతల వల్ల ప్రతినిత్యం ఏదో ఒక ప్రమాదం జరుగుతున్నా కూడా సంబంధిత అధికారులు ఇటువంటి చర్యలు చేపట్టకపోవడం శోచనీయం గా ఉందని వారు విమర్శించసాగారు. ముఖ్యంగా ఏదైనా ప్రమాదం సంభవించిన, ఎవరైనా గుండెపోటుకు గురైన, పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణీ లను ఆస్పత్రికి తరలించాలన్న ఈ రోడ్ల వల్ల సకాలానికి చేరుకోలేక మార్గమధ్యంలో ఏమవుతుందోనని ఒకపక్క వాహనాల వారు మరోపక్క వారి కుటుంబ సభ్యులు పడే ఆందోళనలు అంతా ఇంతా కాదు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి ఈ రోడ్లపై చర్యలు తీసుకొని తమకు సౌకర్యం కలిగించాలని వారు కోరుతున్నారు.

No comments:
Write comments