లాభనష్టాలు లేకుండా ఇసుక సరఫరా

 

మొదటివారంలో ధరల ఖరారు 
తొలుత కొన్నిచోట్ల ప్రయోగాత్మకంగా మొదలు 
 గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
 అమరావతి ఆగష్టు 22 (globelmedianews.com
ఎలాంటి లాభాపేక్ష లేకుండా, ప్రభుత్వానికీ నష్టంలేని విధంగా ఇసుక విధానం తెస్తామని, ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా తక్కువ ధరలనే ఖరారు చేస్తామని గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. వచ్చేనెల నుంచి రాష్ట్రంలో కొత్త ఇసుక విధానం రానుండటంతో దాని తీరుతెన్నులపై ఆయన  మాట్లాడారు. రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలను నిలిపేయడంతో దోపిడీకి గండిపడిందని, ఇపుడు అలాంటివారే ఇసుక కొరత ఉందనేలా ప్రచారం చేస్తున్నారని చెప్పారు. 200 చోట్ల తవ్వకాలు : ‘‘ఇసుక తవ్వకాలకు సంబంధించి 100 రీచ్లు గుర్తించాం. వీటితోపాటు 65 చోట్ల పట్టాభూముల్లో ఉన్న ఇసుక ప్రాంతాలు, జలాశయాల వంటిచోట్ల పూడికరూపంలో ఇసుక ఉన్న 35 ప్రాంతాలను ఎంపికచేశాం. 
లాభనష్టాలు లేకుండా ఇసుక సరఫరా 

పట్టాభూములు, పూడికల తవ్వకాలకు పర్యావరణ అనుమతులు అవసరం లేదు. నదుల్లో రీచ్లకు మాత్రం కావాలి. ఇవన్నీ తీసుకుంటున్నాం. తవ్వకాలు, తరలింపులకు కావల్సిన వసతుల కల్పన బాధ్యతను ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) చూస్తోంది. ఇసుక విక్రయాలను జిల్లాల్లో ఉన్న గనులశాఖ అధికారులు పర్యవేక్షిస్తారు. విక్రయాల్లో ఏపీఎండీసీకి 2-5% లోపు కమీషన్ ఇచ్చే ఆలోచనలో ఉన్నాం. ఎంతనేది ఇంకా ఖరారుచేయాల్సి ఉంది’’ అని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు.అవసరాలమేర అందుబాటులో ఇసుక : ‘‘రాష్ట్ర అవసరాల మేరకు ఇసుక అందుబాటులో ఉంది. తాజాగా కృష్ణా, గోదావరి, వంశధార, నాగావళి నదులకు వచ్చిన వరదలతో మరింత పెరగనుంది. ఇసుక ధర ఎంతనేది వచ్చేనెల మొదటివారంలో ఖరారుచేస్తాం. కొత్త ఇసుక విధానం కూడా అప్పుడే ప్రకటిస్తాం. మొదటివారంలోనే లాంఛనంగా కొన్నిచోట్ల విక్రయాలు ఆరంభిస్తాం. వచ్చే నెలాఖరుకు ఎంపికచేసిన అన్నిచోట్లా ఇసుక తవ్వకాలు, విక్రయాలు మొదవుతాయి. విశాఖపట్నానికి శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాల నుంచి తీసుకెళ్లి, నిల్వచేసి విక్రయిస్తాం. గతంలోలా కాకుండా పారదర్శకంగా, తక్కువధరకు అందరికీ ఇసుక దొరుకుతుంది’’ అని మంత్రి తెలిపారు. ఓ మంచివిధానం అమలుచేసే ముందు కొంత ఇబ్బందులు తప్పవని, ఆ విధానంతో అందరికీ మేలు జరుగుతుందని చెప్పారు.

No comments:
Write comments