అమరావతి ప్రాంతంలో బీజేపీ క్షేత్ర పర్యటన

 

గుంటూరు ఆగష్టు 27  (globelmedianews.com)
రాష్ట్ర రాజధాని అమరావతిలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు  కన్నాలక్ష్మీ నారాయణ, ఎంపీ  సుజనాచౌదరి పర్యటించారు. మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో అక్కడి రైతుల సమస్యలను తెలుసుకున్నారు.తరువాత కన్నా మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ పాలన అస్తవ్యస్తంగా ఉంది. మాట తప్పం,మడెం తిప్పం అని మాటలు చెప్పడమే కానీ, పని చెయ్యడంలో వైసీపీ విఫలమైంది. ప్రతి విషయాన్ని పెద్దదిగా చేసి చూడటం తప్ప జగన్,వారి మంత్రులు చేసేది ఏమి కనపడటం లేదు. అమరావతి నిర్మాణం లో అవినీతి జరిగింది,జరిగింది అంటున్నారే కానీ, అవినీతికి కారణమైన ఎవరు అనేది కనిపెట్టలేదని అన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉంది మీరు...శిక్షించే హక్కు మీకు ఉంది, అవినీతి నిరూపించి, కారణమైన వారిని ఎందుకు శిక్షించటంలేదు. 
అమరావతి ప్రాంతంలో బీజేపీ క్షేత్ర పర్యటన

2009లో కృష్ణా నదికి వచ్చిన వరద వల్ల రాజధాని 29 గ్రామాలలో ఏ ఒక్క గ్రామం వరద బారిన పడటం నేను చూడలేదు. రాజధాని అమరావతి అని ప్రకటన చేసినప్పుడు వైసీపీ ఎందుకు మద్దతు తెలిపిందని ప్రశ్నించారు. రాజధాని ఇక్కడి నుండి మార్చడం మూర్ఖత్వం. స్వయానా నరేంద్రమోదీ శంకుస్థాపన చేసి , ఈ నిర్మాణానికి నాంది పలికారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బీజేపీ అన్నివిధాలా సహాయ సహకారాలు అందిస్తోందని వెల్లడించారు. ప్రపంచంలో ఎక్కడా నేను చూడలేదు. 33000 వేల ఎకరాలు భూమిని రాజధానికి రైతులు స్వచ్ఛందంగా ఇవ్వడం. రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. రైతు శ్రేయస్సు కోరే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇప్పటి వరకు ఈ అమరావతి ప్రాంతంలో 39000 వేల కోట్ల రూపాయల పనులు ప్రారంభించారు..దీనికి సంబంధించి 9000 వేల కోట్లు పలు కంపెనీలకు ఇవ్వడం జరిగిందని అన్నారు. ఇన్ని వేల కోట్ల నిర్మాణ పనులని వైసీపీ ప్రభుత్వం నిలిపివేసింది. అమరావతి నిర్మాణంపై ప్రభుత్వ ఉద్దేశం ఏమిటో ఇంతవరకు ప్రకటన చెయ్యలేదు. ప్రజా సమస్యలపై ఇప్పటికి నేను 3 సార్లు ప్రభుత్వానికి లేఖలు రాసాను...ఇంతవరకు ఎటువంటి సమాధానం రాలేదని అన్నారు. రైతులకి కౌలు డబ్బులని ఆపేశారు...వారికి కౌలు త్వరగా ఇవ్వాలని కోరుతున్నానని అన్నారు. నిరుపేదల గృహాలు కూడా వారికి ఇవ్వకుండా వైసీపీ ప్రభుత్వం నిలుపుదల చేసింది. కేంద్రం సహకారంతో నిర్మించిన ఇళ్లను, పేదలకు ఇవ్వకుండా అడ్డుకునే హాక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదని అన్నారు. 

No comments:
Write comments