రా రమ్మని పిలుస్తున్న కుంటాల

 

అదిలాబాద్, ఆగస్టు 5, (globelmedianews.com - Swamy Naidu)
ములుగు జిల్లా వాజేడు మండలంలోని బొగత జలపాతానికి పర్యాటకులు క్యూ కట్టారు. ఆదివారం కావడంతో.. జలపాతం అందాలు చూసేందుకు దూర ప్రాంతాల నుంచి తరలివెళ్తున్నారు. వరద పిలిచే బొగత వాటర్ ఫాల్స్ ను చూడటానికి పర్యటకులు క్యూ కట్టారు. మూడు నాలుగు రోజులనుంచి పడుతున్న వానలకు రాష్ట్రంలోని వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి .దట్టమైన అటవీప్రాతంలో సహజసిద్ధంగా ఏర్పాడిన కుంటాల జలపాతం  గల గల పారేసెలయేళ్లు.. జలజల పారే అందమైన రెండు జలపాతాలు.. అద్బుతమైన అడవులు, కొండకోనలు.. పచ్చని ప్రకృతి… కనువిందు చేసే  కుంటాల జలపా తం  అందాలకు పర్యాటకులు మంత్రముగ్ధులవుతున్నారు.
 రా రమ్మని పిలుస్తున్న కుంటాల
ఈ జలపాతం ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలో ఉంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రం నుంచి 60 కీలో మీటర్లు ఉంటుంది. నిర్మల్ జిల్లా కేంద్రం నుండి 40 కీలో మీటర్ల దూ రంలో ఉంది. ఇటీవల కురిసిన వర్షాలతో కుంటాల జలపాతం మరింత శోభను సంతరించుకుంది. రోజురోజుకు సందర్శకుల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యం గా సెలవు రోజుల్లో ఇతర రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో వచ్చి ప్రకృతి ఒడిలో పరవశించిపోతున్నారు. ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకునే కుంటా ల జలపాతం కడెం నదిపై ఉన్న కుంటాల జలపాతం వద్ద 42 ఆడుగుల  ఎత్తు నుంచి సెలయేళ్లు  నయాగరా జలపాతంగా 
ఆకట్టుకుంటోంది. జలపాతం అందాలు 7 నెలలు కనువిందు చేస్తుంది. సహజసిద్ధ ్ద జలపాత సోయగాలను చూసేందుకు రా..రామ్మని పిలుస్తోంది.

No comments:
Write comments