కొనలేం తినలేం.. (నెల్లూరు)

 

నెల్లూరు, ఆగస్టు 03 (globelmedianews.com - Swamy Naidu): జిల్లాలో సామాన్య, మధ్యతరగతి ప్రజలు కూరగాయలు కొనాలంటేనే బెంబేలు ఎత్తిపోతున్నారు. ఏమీ కొనేట్టులేదు. తినేట్టు తేదు అనే పరిస్థితి ఉంది. జిల్లాలోనే అతి పెద్ద కూరగాయాల మార్కెట్‌ నెల్లూరు జిల్లా కేంద్రంలో ఉంది. ఏసీ మార్కెట్‌ పేరుతో నెల్లూరు పాత మద్రాసు బస్టాండ్‌ సమీపాన ఉండే ఈ మార్కెట్‌లో నిత్యం దాదాపు కోటిరూపాయలపైగా వ్యాపార లావాదేవీలు జరుగుతుంటాయి... కాని గత కొంత కాలం నుంచి సగానికి పైగా లావాదేవీలు పడిపోయి..వ్యాపారాలు 70 శాతం పైగా క్షీణించాయి. కొనుగోలు దారులు మార్కెట్‌కు రావడం బాగా తగ్గించారు. దీంతో మార్కెట్‌ బోసిపోయింది.ఎప్పుడూ లారీల రాకపోకలతో కొనుగోలు దారుల వాహనాలతో కిక్కిరిసి  కనిపించే ప్రధాన మార్కెడ్‌ రోడ్డు మార్గం కూడా రద్దీ తగ్గిపోయింది.

 కొనలేం తినలేం.. (నెల్లూరు)
ఈమధ్య వరకు భానుడు చూపే ప్రభావం చివరికి కూరగాయల వ్యాపారంపై పడింది. తీవ్రమైన వేడి గాలులు, ఎండల ప్రభావం వ్యాపారంపై పడింది. పైగా వాతవరణపరంగా రోజుకొక విధంగా మార్పులు ఉండటంతో జిల్లాకు అనేక రకాల కూరగాయల దిగుమతి గణనీయంగా పడిపోయింది. ప్రధానంగా ప్రతి ఇంట్లో ప్రతి కూరకు వాడే టమోటా రేటు గంటకో విధంగా రోజుకో విధంగా మారిపోతోంది. టమోటా నుంచి క్యారెట్, బీనీస్, బీట్‌రూట్‌ తదితర ప్రధాన కూరగాయలు మన జిల్లాకు కర్ణాటక నుంచి ఎక్కువ దిగుమతి అవుతాయి. చైన్నె హోల్‌సేల్‌ మార్కెట్‌ నుంచి పెద్ద ఎత్తున కూరగాయలు మనకు దిగుమతి అవుతాయి. ఒక్కసారిగా ఇతర రాష్ట్రాలనుంచి వచ్చే కూరగాయల దిగుమతి కూడ తగ్గిపోయింది.పైగా జిల్లా పరిధిలోని వివిధ పల్లెసీమల నుంచి వచ్చే ఆకుకూరలు, బెండకాయలు, వంకాయలు కూడ జిల్లాకేంద్రానికి సరిపడనంత రావడంలేదు. ప్రస్తుతం కూరగాయల ధరలు వింటే జనం బెంబేలెత్తుతున్నారు. పదిరూపాయల లోపు అమ్మే కొత్తిమీర కట్ట 30 రూపాయలకు చేరిపోయింది. 50 రూపాయల లోపు అమ్మే కేజీ బీనిస్‌ రూ.150 పలుకుతుంది. కూరల్లో తక్కువగా వాడే అల్లం సైతం కేజీ రూ.150 పలుకుతోంది. బీట్‌రూట్‌ రూ.60, క్యారేట్‌ 60, టమోటాలు 40, ఉల్లి గెడ్డలు 40, బెండకాయలు 40, వంకాయలు 30 ఇలా ఏవి కొనాలన్నా 20రూపాయల లోపు లేవు..ఒక వైపు తీవ్రంగా కాస్తున్న వడగాలులు, ఎండల వలన నిత్యం వివిధ రకాల కూరగాయలు ఎండిపోతున్నాయని, తీవ్రంగా నష్టపోతున్నామని కొందరు కూరగాయల వ్యాపారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.అధిక ధరల వలన వినియోగదారులు మార్కెట్‌కు రావడం 50 శాతంపైగా  తగ్గిపోయారని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. సామాన్య ప్రజలు కూడా అధిక ధరలతో మేం కోనుగోలు చేయలేకుండా ఉన్నామని లబోదిబో మంటున్నారు. మొత్తం మీద వాతావరణ ప్రభావంతో వివిధ రూపాల్లో కూరగాయల వ్యాపారం భారీగా పడిపోయింది.

No comments:
Write comments