వైసీపీకి బీజేపీ నుంచి సాయం.. అనుమానమే

 

విజయవాడ, ఆగస్టు 12  (globelmedianews.com):
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలైనా అత్యంత కీలకమైన రాజధాని అమరావతి నిర్మాణం విషయంలో ఏమాత్రం ఆసక్తి చూపించట్లేదనీ, ఫలితంగా అమరావతి కలలు కల్లలవుతున్నాయని మండిపడుతోంది టీడీపీ. ఆ పార్టీ విమర్శలకు తగ్గట్టుగానే ఉంటున్నాయి వాస్తవ పరిస్థితులు కూడా. ప్రస్తుతం అమరావతిలో నిర్మాణాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. రోడ్లు, భవనాల నిర్మాణాలు మొండికేశాయి. ఉచిత ఇసుకపై ప్రభుత్వం నిషేధం విధించడంతో... రియల్ ఎస్టేట్ రంగానికి బ్రేక్ పడింది. ఇదే సమయంలో... ఏపీ ప్రభుత్వానికి నిధులు ఇచ్చేందుకు ప్రపంచబ్యాంక్ వెనకడుగు వేసింది. అలాగే... రాష్ట్ర బడ్జెట్‌లో కూడా రాజధాని నిర్మాణానికి జస్ట్ రూ.500 కోట్లు మాత్రమే కేటాయించారు. ఫలితంగా హైకోర్టు, అసెంబ్లీ, సెక్రటేరియట్, ప్రభుత్వ భవనాల నిర్మాణం ఎప్పుడన్నది సస్పెన్స్ అయ్యింది.
వైసీపీకి బీజేపీ నుంచి సాయం.. అనుమానమే

గత ప్రభుత్వం అమరావతి నిర్మాణాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. జపాన్, సింగపూర్ తరహా నిర్మాణాలు చేపడతామని ప్రకటించింది. ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన రాజధానిని కట్టి ఇస్తామని హామీ ఇచ్చింది. ఐతే... ఐదేళ్ల పాలనలో ప్రజలు కోరుకున్న రేంజ్‌లో రాజధాని నిర్మాణం వేగవంతంగా సాగకపోవడంతో... టీడీపీపై ప్రజలు నిరాశ చెందారు. అదే సమయంలో అధికారంలోకి వచ్చిన వైసీపీ... కనీసం ఆ మాత్రం కూడా రాజధానిపై ఫోకస్ పెట్టట్లేదన్న విమర్శలు వస్తున్నాయి. రియల్ ఎస్టేట్ పడిపోవడంతో... కూలీలు రోడ్డెక్కారు. పనులు లేక తలో దిక్కుకూ వెళ్లిపోతున్నారు.వాస్తవానికి రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు ఇవ్వాలి. రాజ్ భవన్, అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్ట్ అన్నింటికీ కేంద్రమే డబ్బులివ్వాలి. 1375 ఎకరాల్లో కట్టాలనుకున్న ఇవన్నీ పూర్తవ్వాలంటే కొన్ని వేల కోట్లు అవసరం. కానీ కేంద్రం జస్ట్ రూ.1500 కోట్లు మాత్రమే ఇచ్చింది. గత ప్రభుత్వం రూ.62,623 కోట్లు ఇవ్వాలని కోరింది. అమరావతి మొత్తం నిర్మాణానికి రూ.1,09,023 కోట్లు అవుతుందని అంచనా వేసింది. కేంద్రం నుంచీ తగిన సాయం లేకపోవడంతో ఇవన్నీ ఊహలకే పరిమితమయ్యాయి.తాజాగా వైసీపీ ప్రభుత్వ పాలన కూడా అరాచకంగా ఉందని... బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. దీన్ని బట్టీ మనకు అందే సంకేతం ఒకటే. వైసీపీ ప్రభుత్వానికి కూడా బీజేపీ సహాయ సహకారాలు అందించే అవకాశాలు లేకపోవచ్చు. అందువల్ల అమరావతి నిర్మాణం కష్టమే అంటున్నారు విశ్లేషకులు. నిర్మాణాలు ఎప్పటికి పూర్తవుతాయో వైసీపీ ప్రభుత్వం కూడా చెప్పలేని పరిస్థితి తలెత్తిందంటున్నారు

No comments:
Write comments