'మదర్ థెరిసా ఎక్సెలెన్స్ అవార్డు'ల బహుకరణ

 

హైదరాబాద్ ఆగష్టు 27 (globelmedianews.com)
మదర్ థెరిసా జయంతిని పురస్కరించుకుని తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖలో పనిచేస్తూ, విశేష సేవలందిస్తున్న ఉద్యోగులకు ప్రజామిత్ర సంస్థ హైదరాబాద్ ఎస్వీకెలోని దొడ్డి కొమరయ్య హాల్ లో 'మదర్ థెరిసా ఎక్సెలెన్స్ అవార్డు'లను బహుకరించింది.
 'మదర్ థెరిసా ఎక్సెలెన్స్ అవార్డు'ల బహుకరణ

ముఖ్య అతిథథులుగా టీఎస్పీఎస్ అసిస్టెంట్ సెక్రటరీ డాక్టర్ వెంకట్ గండూరి, గాంధీ హాస్పిటల్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ గుర్రం నరసింహారావు నేత,  తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బి. స్వర్ణలత, ప్రజామిత్ర సంస్థ ఛైర్మన్ భారత సుదర్శన్, 2వ ఏఎన్ఎం అసోసియేషన్ - తెలంగాణ రాష్ట్ర సమన్వయకర్త జి. మాధవీలత పాల్గొని ప్రసంగించారు.రాష్ట్రంలోని అన్ని జిల్లాలలోని పీహెచ్సీలలో సుదీర్ఘ కాలంగా పని చేస్తున్న ఉద్యోగులకు ముఖ్య అతిథులు మెమొంటోలు, ప్రశంసా పత్రాలను అందజేసి, శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ అవార్డులను అందుకున్నవారిలో జి. మాధవీలత, హసీర్ ఫర్నిసా, అండాలు, కొంఠన్, అరుణ, సువర్ణ, శ్రీదేవి, సునీత, షాజహాన్ తదితరులతో పాటుగా 20 మందిని సత్కరించారు.

No comments:
Write comments