రాఘవేంద్ర స్వామి మహా రథోత్సవానికి హజరయిన ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి

 

మంత్రాలయం ఆగష్టు 19  (globelmedianews.com - Swamy Naidu)
కలియుగ దైవమైన రాఘవేంద్ర స్వామి మహా రథోత్సవానికి మంత్రాలయం నియోజకవర్గం ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి  ముఖ్యఅతిథిగా హాజరయ్యారు స్వగ్రామం నుండి  మంత్రాలయం చేరుకున్న బాల నాగిరెడ్డికి అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ముందుగా గ్రామ దేవత మంచాలమ్మను దర్శించుకుని అనంతరం  రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పీఠాధిపతులు  బాలనాగిరెడ్డికి ఫల మంత్రాక్షతలు ఇచ్చి ఆశీర్వదించారు. వసంతోత్సవం లో భాగంగా రంగులు చల్లారు. 
రాఘవేంద్ర స్వామి మహా రథోత్సవానికి హజరయిన  ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి 
మహా రథోత్సవం సందర్భంగా బాలనాగిరెడ్డి కి పీఠాధిపతులు బంగారు గొలుసును  ప్రధానం చేసి శాలువా వేసి ఆశీర్వదించారు. మహా రథోత్సవానికి బాలనాగిరెడ్డి కూతురు ప్రియాంక రెడ్డి మనవడు మనవరాలు కూడా హాజరయ్యారు. మండల కన్వీనర్ భీమిరెడ్డి మాజీ సర్పంచ్ భీమయ్య గోరుకల్లు కృష్ణస్వామి వైయస్సార్ సిపి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై ఎమ్మెల్యే వెంట ఉన్నారు.

No comments:
Write comments