వడోదరలో మొసళ్ల బెడద

 

అహ్మదాబాద్ ఆగస్టు 24, (globelmedianews.com)
గుజరాత్ రాష్ట్రంలోని వడోదర నగరంలో భారీవర్షాలతో వరదలు వెల్లువెత్తడంతో  మొసళ్లు ప్రజలను భయపెడుతున్నాయి. వరదనీటిలో జనవాస ప్రాంతాలకు కొట్టుకువచ్చిన 52 మొసళ్లను అటవీశాఖ అధికారులు కాపాడి వాటిని విశ్వామిత్రి నదిలో వదిలేశారు. వరదనీటిలో జనవాసాలకు వచ్చిన మొసళ్లను పట్టుకునేందుకు 24 గంటలు పనిచేసేలా హెల్ప్లైన్ను ఏర్పాటు చేశారు.
వడోదరలో మొసళ్ల బెడద

వరదనీరు వచ్చినపుడు మొసళ్లు వాటిలో కొట్టుకువచ్చాయని, వీటిని కాపాడమని అటవీశాఖ అధికారులు చెప్పారు. కరేలీబాగ్ ప్రాంతంలోని మురికివాడలోకి వచ్చిన 16 అడుగుల మొసలిని కూడా కాపాడామని అటవీశాఖ అధికారులు వివరించారు. జనవాసాల్లోకి వరదనీటిలో మొసళ్ల రాకతో జనం భయాందోళనలు చెందారు.  శనివారం ఉదయానికి వరద ప్రవాహం తగ్గడంతో పునరావాస కార్యక్రమాలు ఊపందుకున్నాయి.

No comments:
Write comments