నిలిచిపోయిన ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌ఎస్‌, జేహెచ్‌ఎస్‌ వైద్యసేవలు

 

హైదరాబాద్‌ ఆగష్టు 16 (globelmedianews.com - Swamy Naidu)
ప్రభుత్వం ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించడంలేదని నిరసిస్తూ ప్రైవేటు ఆస్పత్రులు ఆందోళనకు దిగాయి. ఇవాళ ఉదయం నుంచి ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌ఎస్‌, జేహెచ్‌ఎస్‌ వైద్యసేవలను నిలిపివేశాయి. కార్పోరేట్‌ ఆస్పత్రులతోపాటు 240 వరకు ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ వైద్యసేవలు ఆగిపోయాయి. 
 నిలిచిపోయిన ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌ఎస్‌, జేహెచ్‌ఎస్‌ వైద్యసేవలు
ప్రభుత్వం బకాయిలు చెల్లించేంతవరకు వైద్యసేవలు నిలిపివేస్తున్నట్లు నెట్‌వర్క్‌ ఆస్పత్రులు ప్రకటనలో తెలిపాయి. ఈ నేపథ్యంలో వారి సమస్యలను తెలుసుకునేందుకు ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులను ప్రభుత్వంమధ్యాహ్నం 3 గంటలకు చర్చలకు పిలిచింది.

No comments:
Write comments