చంద్రబాబు ఎమోషనల్ ట్వీట్

 

హైద్రాబాద్, ఆగస్టు 29, (globelmedianews.com)
నీ నటుడు, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ ప్రథమ వర్ధంతి రోజున టీడీపీ అధినేత చంద్రబాబు నివాళి అర్పించారు. ఆయన్ను స్మరించుకుంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు. ‘ఎన్టీఆర్ ఆదర్శాల బాటలో నడిచి ప్రజాబంధువుగా, సౌమ్యుడిగా ప్రజల హృదయాలలో శాశ్వతస్థానాన్ని సంపాదించుకున్న కీర్తిశేషులు హరికృష్ణగారు. ఆ మంచిమనిషి మనకు దూరమై ఏడాది గడిచినా మన మధ్యలోనే ఉన్నారనిపిస్తోంది. ఈరోజు హరికృష్ణగారి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన ఆత్మీయ స్మృతులను స్మరించుకుందాం’అన్నారు.ఇటు మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కూడా ట్వీట్ చేశారు. ‘చెరగని చిరునవ్వు, భోళాతనం, చిన్నాపెద్దా అందరికీ ఆత్మీయతను పంచే మంచితనం... వీటన్నిటికీ నిలువెత్తురూపం మావయ్య హరికృష్ణగారు.
చంద్రబాబు ఎమోషనల్ ట్వీట్

ఏడాది గడిచినా ఆయన లేరనే విషయం నమ్మలేనిదిగా ఉంది. హరికృష్ణగారి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన స్మృతికి నివాళులర్పిద్దాం’అన్నారు. చెరగని చిరునవ్వు, భోళాతనం, చిన్నాపెద్దా అందరికీ ఆత్మీయతను పంచే మంచితనం... వీటన్నిటికీ నిలువెత్తురూపం మావయ్య హరికృష్ణగారు. ఏడాది గడిచినా ఆయన లేరనే విషయం నమ్మలేనిదిగా ఉంది. హరికృష్ణగారి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన స్మృతికి నివాళులర్పిద్దాం.వాస్తవానికి హరికృష్ణ గతేడాది ఆగస్టు 29న కన్నుమూశారు. కానీ తెలుగు తిథుల ప్రకారం ఆయన వర్ధంతిని కుటుంబ సభ్యులు ఈ నెల 18న నిర్వహించారు. హరికృష్ణకు టీడీపీ అధినేత చంద్రబాబు, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌‌తో పాటూ కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. గతేడాది ఆగస్టు 29న నల్గొండ సమీపంలోని అన్నేపర్తి దగ్గర హరికృష్ణ ప్రయాణిస్తున్న కారు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్ర గాయాలు కాగా.. స్థానికులు ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన చనిపోయినట్లు డాక్టర్లు నిర్థారించారు. నెల్లూరు జిల్లాలో ఓ అభిమాని ఇంట్లో జరిగే శుభకార్యానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. హరికృష్ణ ప్రాణాలు కోల్పోగా.. అదే కారులో ఉన్న మరో ఇద్దరు స్నేహితులు తీవ్రంగా గాయపడ్డారు.

No comments:
Write comments