ముహూర్తాల జోలికి వెళ్ళకుండా తక్షణమే నీటిని విడుదల చేయాలి బిజెపి నాయకురాలు మాజీమంత్రి డికె అరుణ డిమాండ్

 

 హైదరాబాద్ ఆగష్టు 9 (globelmedianews.com - Swamy Naidu):
ప్రభుత్వం, ఇరిగేషన్ అధికారులు రాజకీయాలు, ముహూర్తాల జోలికి వెళ్ళకుండా తక్షణమే రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేయాలని బిజెపి నాయకురాలు మాజీమంత్రి డికె అరుణ డిమాండ్ చేసారు.. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు జులై 30 నుంచి వరద ప్రారంభమైనాదని, అదే రోజు సాయంత్రం నుంచి నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం ద్వారా గుడ్డెందొడ్డి రిజర్వాయర్ కు నీరు ఎత్తి పోయడం ప్రారంభమైందన్నారు.
 ముహూర్తాల జోలికి వెళ్ళకుండా తక్షణమే నీటిని విడుదల చేయాలి
 బిజెపి నాయకురాలు మాజీమంత్రి డికె అరుణ డిమాండ్
నిర్ణీత సామర్థ్యం మేరకు రిజర్వాయర్లో నీరుచేరినందున గుడ్డెందొడ్డి రిజర్వాయర్ కుడి, ఎడమల కాలవల నుంచి చెరువులతో పాటు ఆయకట్టుకు నీరు వధలాల్సి ఉందని, దాదాపు 20వేల ఏకరాలకు రైతులు సాగునీరు పొందాల్సి ఉన్నదన్నారు.వేసుకున్న నారుమళ్లు చివరి దశకు చేరుకున్నాయన్నారు. గత ఏడాదితో పోల్చుకుంటే  జూరాల నుంచి 12 రోజులు ఆలస్యంగా నీటిని ఎత్తి పోసుకున్నామని, మళ్లీ సమంజసం కానీ కారణాల వల్ల నీటి విడుదల జాప్యం చేస్తున్నారన్నారు.దీని వల్ల వారి నారు ఎండి... సమయం చాలక రైతులు నష్టపోయో పరిస్థితిని ప్రభుత్వం కల్పించవద్దని కోరారు. తక్షణమే నీటి విడుదల జరగకపోతే రైతులతో కలసి ఇరిగేషన్ కార్యాలయాన్ని ముట్టడిస్థామని అరుణ హెచ్చరించారు.

No comments:
Write comments