గవర్నర్ ను కలిసిన తేదేపా నేతలు డ్రోన్ ప్రయోగంపై ఫిర్యాదు

 

అమరావతి ఆగష్టు 19  (globelmedianews.com - Swamy Naidu)
ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను తెలుగుదేశం పార్టీ నేతల బృందం కలిసింది. చంద్రబాబు నివాసంపై డ్రోన్ల ప్రయోగంపై టీడీపీ నేతలు గవర్నర్  ఫిర్యాదు చేశారు. చంద్రబాబు నివాసాన్ని డ్రోన్లతో చిత్రీకరించారని వారు ఫిర్యాదు చేసారు. ఫ్లడ్ మేనేజ్మెంట్ లో ప్రభుత్వం విఫలమైందని, సహాయక చర్యల్లో అలసత్వం వహించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. డ్రోన్ల ప్రయోగం అంశంపై టీడీపీ ఇప్పటికే గుంటూరు ఐజీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఫ్లడ్ మేనేజ్మెంట్ పై ఇప్పటికే టీడీపీ జ్యుడీషియల్ విచారణ కోరింది. 
 గవర్నర్ ను కలిసిన తేదేపా నేతలు డ్రోన్ ప్రయోగంపై ఫిర్యాదు
గవర్నర్ ను కలిసిన వారిలో కళా వెంకటరావు, అచ్చెన్నాయుడు, కేశినేని నాని, గల్లా జయదేవ్, కనకమేడల, టీడీఎల్పీ ఉపనేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలు ఉన్నారు. తరువాత అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబునాయుడు నివాసంపై డ్రోన్ వినియోగించడంపై కోర్టులో ప్రైవేటు కేసు దాఖలు చేయాలని నిర్ణయించామని వెల్లడించారు. ప్రతిపక్ష నాయకుడి ఇంటిపై డ్రోన్లు వీడియోలు తీస్తుంటే దీన్ని ప్రతిఘటించిన తమ నాయకులు, కార్యకర్తలపై అన్యాయంగా ఏడు కేసులు పెట్టారని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారుచంద్రబాబు నివాసంపై డ్రోన్ వినియోగించే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఈకేసులో ముఖ్యమంత్రి జగన్ పేరును కూడా చేరుస్తామన్నారు. లంక గ్రామాలు మునిగిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే పట్టించుకోకుండా చంద్రబాబు నివాసం చుట్ట తిరుగుతున్నారన్నారు.

No comments:
Write comments