వాట్సాఫ్ ద్వారా సమస్యలు పరిష్కారం - జిల్లా ఎస్ పి సింధు శర్మ

 

జగిత్యాల  ఆగస్టు 9(globelmedianews.com - Swamy Naidu)
వాట్సప్ ద్వారా ఫిర్యాదులు స్వీకరించడానికి జిల్లా ఎస్పీ సింధు శర్మ వాట్సప్ నెంబర్ శుక్రవారం నాడు 9346987153 ను ఆవిష్కరించారు.  జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో జరిగిన కార్యక్రమంలో ఎస్పీ  చేతుల వాట్సాప్ నెంబర్ ను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్బగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలు వారి ఫిర్యాదులను నేరుగా ఫిర్యాదు చేయలేనివారు,దూరప్రాంతాల్లో ఉన్న వారు జిల్లా పోలీసు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు.నేటి ప్రపంచములో అత్యధిక మంది ప్రజలు వాట్సాప్ , ఫేస్ బుక్ వంటి సామాజిక మద్యమాలను వినియోగిస్తూ అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నారని,ఈ అధునాతన  పరిజ్ఞానంతో పోలీస్ సేవలను ప్రజలకు మరింత చేరువ కావాలనే లక్ష్యం తో జిల్లా వ్యాప్తముగా వాట్సాప్ సేవలు ప్రవేశపెట్టామన్నారు.
 వాట్సాఫ్ ద్వారా సమస్యలు పరిష్కారం  -   జిల్లా ఎస్ పి సింధు  శర్మ
ఇందు కోసం 9346987153 నెంబర్ ను కేటాయిoచినట్లు తెలిపారు. ఈ వాట్సాప్ నెంబర్ ద్వారా జిల్లా పరిధిలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా క్షణాల్లో పోలీసు అధికారులకు సమాచారం చేరవేయవచ్చు అన్నారు. ప్రధానంగా ఫిర్యాదు లు, నేరాలు, మహిళ వేధింపులు, ఈవ్ టీజింగ్, రోడ్డు ప్రమాదాలు వెంటనే స్పందించి ఫోటోలు,వీడియోలు తీసి వాట్సప్ ద్వారా చేరవేసి బాధితులకు సహాయం చేయవచ్చు అన్నారు. సమాచారం చేరవేసే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. ఎల్లవేళలా వాట్సాప్ సేవలు    అందుబాటులో ఉండే విధంగా ఐటి కోర్ టీం లో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశామన్నారు. వాట్సాప్ ద్వారా ఆ విభాగం సమాచారాన్ని స్వీకరించి వెంటనే స్పందించి ఆ పరిధిలోని డీఎస్పీ లు ఇన్స్పెక్టర్లు ,ఎస్సైల దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరించే చర్యలు తీసుకుంటారని   వివరించారు.ఈ కార్యక్రమంలో డిఎస్పీ లు మల్లారెడ్డి, వెంకటరమణ, ఐటీ కోర్ టీం ఇన్స్పెక్టర్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

No comments:
Write comments