నిర్మాణ అనుమతులు ఇవ్వండి

 

న్యూ ఢిల్లీ  ఆగస్టు 29, (globelmedianews.com)
తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి  గురువారం దేశ రాజధాని ఢిల్లిలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కలిశారు. తెలంగాణలో జాతీయ రహదారుల నిర్మాణం, పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు, అనుమతులు మంజూరు చేయాలని స్పీకర్ పోచారం విజ్ఞప్తి చేశారు. తెరాష బృందంలో టీఆర్ ఎస్ లోక్ సభాపక్ష నాయకులు నామా నాగేశ్వరరావు, టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు జాజుల సురేందర్, హన్మంత్ షిండే లు కలిసారు.  తెలంగాణ రాష్ట్రంలో 3,155 కిలోమీటర్ల మేర రాష్ట్ర రహదారులను జాతీయరహదారులుగా నిర్మాణం చేయాలి. ఇప్పటి వరకు కేవలం 1,388 కిలోమీటర్ల రాష్ట్ర రోడ్లను మాత్రమే జాతీయ రహదారులుగా గుర్తించారు. మరో 1,767 కిలోమీటర్ల రోడ్లను జాతీయ రహదారులుగా గుర్తించి, నిర్మాణం చేయాలని  కోరారు.  
నిర్మాణ అనుమతులు ఇవ్వండి

రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించి, నిర్మాణం చేపట్టేందుకు భూ సేకరణలో 50 శాతం వ్యయం,ఆటవి భూముల మళ్లింపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని సీఎం కేసీఆర్ గారు పలుమార్లు కేంద్రానికి లేఖలు రాశారాని కేంద్రమంత్రికి తెలిపారు. హైదరాబాద్ లోని గౌరెళ్లి వద్ద ఔటర్ రింగ్ రోడ్ జంక్షన్- వలిగొండ-తొర్రూర్-నెల్లికుదురు-మహబూబాబాద్-ఇల్లందు-కొత్తగూడెం(30వ నెంబర్ జాతీయ రహదారి జంక్షన్)234 కిలోమీటర్లు జాతీయ రహదారిగా గుర్తించి నిర్మాణం,  మెదక్-ఎల్లారెడ్డి-రుద్రూరు 92 కిలోమీటర్లు జాతీయ రహదారి గా గుర్తించి నిర్మాణం, బోధన్-బాసర-బైంస 76 కిలోమీటర్లు జాతీయ రహదారి నిర్మాణం,  మెదక్-సిద్దిపేట్-ఎల్కతుర్తి 133 కిలోమీటర్లు జాతీయ రహదారిగా గుర్తించి నిర్మాణం, చౌటుప్పల్-షాద్ నగర్-కంది 186 కిలోమీటర్ల దక్షిణ భాగ ప్రాంతీయ వలయ రహదారి హైదరాబాద్ వరకు, సంగారెడ్డి-నర్సాపూర్-తూప్రాన్-గజ్వేల్-భువనగిరి-చౌటుప్పల్ ఉత్తర భాగ ప్రాంతీయ వలయ రహదారి ని కలపాలని వినతి పత్రంలో పేర్కోన్నారు. ఈ ఐదు రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించి, భూ సేకరణ ప్రక్రియ మొదలుపెట్టేలా సహకరించండని కేంద్ర మంత్రిని కోరారు. .

No comments:
Write comments