పెద్దపులి మృతి

 

కుమురం,ఆగస్టు 26 (globelmedianews.com
కుమురంభీం జిల్లా సిర్పూర్(టి)కి దాదాపు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నతెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో పెద్దపులి మృతి చెందిన సంఘటన కలకలం రేపుతుంది... మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా గోండు పిప్రి అటవీ డివిజన్ పరిధిలోని పోడ్సా గ్రామ సమీప పంట పొలాల్లో మృతి చెంది ఉన్న పెద్దపులిని గ్రామస్తులు గుర్తించి, అటవీ అధికారులకు సమాచారం అందించారు.
పెద్దపులి మృతి

దీంతో అక్కడికి చేరుకున్న అటవీశాఖ అధికారుల బృందం పులి మృతదేహాన్ని పరిశీలించి మృతికి గల కారణాలను తెలుసుకోవడానికి చర్యలు చేపట్టారు. పశువైద్యాధికారులతో పంచనామా నిర్వహించి పోస్టుమార్టం చేశారు. మృతి చెందిన పెద్దపులి మహారాష్ట్రకు చెందినదిగా అధికారులు భావిస్తున్నారు. సరిహద్దు ప్రాంతం కావడంతో తెలంగాణకు చెందిన పెద్దపులినా, మహారాష్ట్రకు చెందిన పులా అనేదానిపై స్పష్టత రావడం లేదు..తెలంగాణ ప్రాంతాల్లోని కొంతమంది అటవీ శాక  సిబ్బంది పెద్దపులి మృతిచెందిన ప్రాంతాన్నిసందర్శించి విచారణ చేస్తున్నారు

No comments:
Write comments