వీహెచ్ బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నారా

 

హైద్రాబాద్, ఆగస్టు 14, (globelmedianews.com - Swamy Naidu
తెలంగాణ కాంగ్రెస్ లో వివాదాస్పద నాయకుడు వి హనుమంత రావు. వయోభారం వెంటాడుతున్నప్పటికీ కరెంట్ పాలిటిక్స్ లో ఏ మాత్రం వెనక్కి తగ్గని విహెచ్ దూకుడు సొంత పార్టీ వారికి తలనొప్పి గా మారింది. దశాబ్దాల తరబడి కాంగ్రెస్ నే నమ్ముకున్న ఆయన ఇటీవల పార్టీలో తనకు సరైన ప్రాధాన్యత లభించడం లేదని ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు. అధిష్టానం గతంలో తనను నెత్తిన పెట్టి చూసుకుంటే ఇప్పుడు కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వని తీరును ఆయన అత్యంత అవమానంగా భావిస్తున్నారని ఆయన వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. రాజీవ్ గాంధీకి వీరవిధేయుడిగా, బిసి నేతగా, మాస్ లీడర్ గా గుర్తింపు తెచ్చుకున్న విహెచ్ తన పార్టీలో పరిణామాలు కలవరానికి గురిచేస్తున్నాయి. దాంతో పొమ్మనలేకుండా పొగబెడుతున్న వాతావరణంలో ఇక ఇమడలేననే ఆక్రోశాన్ని ఆవేదనను వ్యక్తం చేస్తూ మరోసారి వార్తల్లో నిలిచారు హనుమన్న.ఖమ్మం పార్లమెంట్ టికెట్ ఆశించి పార్టీ నో చెప్పిన నాటినుంచి విహెచ్ కి అధిష్టానం పై ఆగ్రహంగానే వున్నారు. 
వీహెచ్ బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నారా
ఆ తరువాతైనా పార్టీలో తగిన గుర్తింపు హోదా వుండే పదవినైనా అధిష్టానం ప్రసాదిస్తుందేమో అని వేచి చూసిన ఆయనకు నిరాశే మిగిలింది. దానికి తోడు వున్న పదవులన్నీ రాజీనామా చేసేయండి అంటూ పార్టీ అధ్యక్షుడే వైదొలిగిపోవడంతో తమ బాధ ఎవారికి చెప్పుకోవాలో విహెచ్ వంటి వారికి అర్ధం కావడం లేదు. భవిష్యత్తులో కూడా తనకు ప్రాధాన్యత ఇచ్చే పరిస్థితి స్పష్టంగా ఆయనకు కనపడటం లేదు. పార్టీకోసం నిత్యం కెసిఆర్ సర్కార్ పై ఎదో రూపంలో ప్రెస్ మీట్లు పెట్టి విమర్శలు చేస్తున్నా మీడియా లో హల్ చల్ చేస్తున్నా అవన్నీ వృధా అని ఆయనకు క్లారిటీ వచ్చేసిందని విశ్లేషకులు అంటున్నారు.కాంగ్రెస్ అధిష్టాన భజన సంఘంలో అగ్రజుడుగా టి కాంగ్రెస్ లో వి హనుమంత రావు ఉండేవారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా వున్నప్పుడు వి.హనుమంత రావు కు ఏఐసిసి లో గట్టి పట్టే ఉండేది. వైఎస్ వంటివారితో సైతం ఆయన పోరాటం చేసేవారు. తెలంగాణ వాదాన్ని, పార్టీలో బిసి లకు ప్రాధాన్యత కోసం మొదటినుంచి కొట్లాట చేస్తూనే వచ్చేవారు విహెచ్. ఈ క్రమంలో ఎన్నడు ఆయన అధిష్టానంపై పల్లెత్తు మాట అనకుండా జాగ్రత్త పడేవారు. అలాంటిది ఇప్పుడు ఆయన కాంగ్రెస్ అధిష్టానం వైఖరిపై నిప్పులు చెరుగుతున్నారు. నేరుగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లనే తనదైన శైలిలో విమర్శలు మొదలు పెట్టేశారు. దీనికి కారణం ఆయన పార్టీకి గుడ్ బై కొట్టి రాజకీయ విశ్రాంతి తీసుకుంటారా లేక అధికారంలో వున్న కేంద్ర రాష్ట్ర పార్టీల్లో ఎదో ఒకదానికి షిఫ్ట్ అవుతారా అన్నది చర్చనీయం అవుతుంది. ఈ రెండుకాక అధిష్టానం తన మాట వినేలా ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ కి విహెచ్ గత్యంతరం లేని పరిస్థితిలో దిగరా అన్నది త్వరలో తేలనుంది.

No comments:
Write comments