చెత్త చెత్తగా.. (మహబూబ్ నగర్)

 

మహబూబ్ నగర్, ఆగస్టు 03 (globelmedianews.com - Swamy Naidu): ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మున్సిపాలిటీలు మురికి కూపాలుగా మారుతున్నాయి. కాలువలు, బహిరంగ ప్రదేశాలు, ఖాళీ స్థలాల్లో పేరుకుపోతున్న చెత్తాచెదారం, మురుగు నీటితోపాటు ఇటీవల కురుస్తున్న వర్షాలతో పురాల్లో పారిశుద్ధ్యం అధ్వానంగా మారుతూ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరాహాలు, ఈగలు, దోమలు స్వైరవిహారం చేస్తున్న కారణంగా వ్యాధులు విజృంభించే ప్రమాదముందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. పరిశుభ్రతకు ప్రాధాన్యమిస్తూ ప్రజలను వ్యాధుల బారి నుంచి కాపాడాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం పురపాలక సంఘాల్లో భూగర్భ మురుగు వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం వర్షాకాలం సమీపించి ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పురపాలక సంఘాల్లో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారుతున్నా.. ప్రభుత్వం భూగర్భ మురుగు వ్యవస్థపై ఒక్క అడుగు ముందుకు వేయలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.మహబూబ్‌నగర్‌, జోగులాంబ గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్‌, నారాయణపేట జిల్లాల్లోని పట్టణాల్లో పారిశుద్ధ్యం అధ్వానంగా మారుతోంది. ప్రధానంగా భూగర్భ మురుగు వ్యవస్థ లేకపోవడంతో పుర పరిధిలోని కాలనీలన్నీ దుర్గంధభరింతగా మారుతున్నాయి. కనీసం జిల్లా కేంద్రాల్లోని పురపాలక సంఘాల్లోనూ భూగర్భ మురుగు వ్యవస్థను ఏర్పాటు చేయడం లేదు. ఫలితంగా దుర్గంధం, వ్యాధులతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు.


 చెత్త చెత్తగా.. (మహబూబ్ నగర్)
మహబూబ్ నగర్, ఆగస్టు 03 (న్యూస్ పల్స్): ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మున్సిపాలిటీలు మురికి కూపాలుగా మారుతున్నాయి. కాలువలు, బహిరంగ ప్రదేశాలు, ఖాళీ స్థలాల్లో పేరుకుపోతున్న చెత్తాచెదారం, మురుగు నీటితోపాటు ఇటీవల కురుస్తున్న వర్షాలతో పురాల్లో పారిశుద్ధ్యం అధ్వానంగా మారుతూ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరాహాలు, ఈగలు, దోమలు స్వైరవిహారం చేస్తున్న కారణంగా వ్యాధులు విజృంభించే ప్రమాదముందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. పరిశుభ్రతకు ప్రాధాన్యమిస్తూ ప్రజలను వ్యాధుల బారి నుంచి కాపాడాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం పురపాలక సంఘాల్లో భూగర్భ మురుగు వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం వర్షాకాలం సమీపించి ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పురపాలక సంఘాల్లో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారుతున్నా.. ప్రభుత్వం భూగర్భ మురుగు వ్యవస్థపై ఒక్క అడుగు ముందుకు వేయలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మహబూబ్‌నగర్‌, జోగులాంబ గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్‌, నారాయణపేట జిల్లాల్లోని పట్టణాల్లో పారిశుద్ధ్యం అధ్వానంగా మారుతోంది. ప్రధానంగా భూగర్భ మురుగు వ్యవస్థ లేకపోవడంతో పుర పరిధిలోని కాలనీలన్నీ దుర్గంధభరింతగా మారుతున్నాయి. కనీసం జిల్లా కేంద్రాల్లోని పురపాలక సంఘాల్లోనూ భూగర్భ మురుగు వ్యవస్థను ఏర్పాటు చేయడం లేదు. ఫలితంగా దుర్గంధం, వ్యాధులతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. రాష్ట్రంలోని అన్ని పురపాలక సంఘాల్లో భూగర్భ మురుగు వ్యవస్థను ఏర్పాటు చేస్తామని రెండేళ్ల క్రితం అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. దీనికి అవసరమైన నిధులను సమకూర్చుతూ పురపాలికలను ఆధునికీకరిస్తామని 2017, జులైలో ఆయన హామీ ఇచ్చారు. ఇందులో భాగంగానే నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలోని పురపాలికలో భూగర్భ మురుగు వ్యవస్థ కోసం రూ.64 కోట్లు మంజూరు చేశారు. ఉమ్మడి జిల్లాలోని మిగిలిన నాలుగు జిల్లా కేంద్రాల్లోని పురపాలక సంఘాల్లో ఈ వ్యవస్థకు సంబంధించిన ప్రణాళికలపై అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు ఉలుకూపలుకు లేకుండా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక పురపాలక సంఘాల అధికారులు భూగర్భ మురుగు వ్యవస్థ కోసం ప్రభుత్వానికి కనీసం ప్రతిపాదనలనూ పంపించలేదు. దీంతో.. ఇప్పట్లో భూగర్భ మురుగు వ్యవస్థ కార్యరూపం దాల్చే అవకాశం లేదని మహబూబ్‌నగర్‌, జోగులాంబ గద్వాల, వనపర్తి, నారాయణపేట పురపాలక సంఘాల్లోని ప్రజలు పేర్కొంటున్నారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని వివిధ పురపాలక సంఘాల్లో భూగర్భ మురుగు వ్యవస్థ ప్రతిపాదనల్లోనే నానుతోంది. గద్వాల పురపాలికలో ఈ వ్యవస్థ కోసం 2012- 13లో అప్పటి మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి ప్రతిపాదించారు. తరవాత ఈ ప్రతిపాదనను పట్టించుకున్న వారే కరవయ్యారు. అప్పటి ముఖ్యమంత్రులు నారా చంద్రబాబునాయుడు, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పురపాలిక ఎన్నికల ప్రచారంలో భాగంగా వనపర్తి వచ్చినపుడు భూగర్భ మురుగు వ్యవస్థను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఆ ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు ఈ హామీని అమలుచేయలేదని వనపర్తి పుర ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహబూబ్‌నగర్‌, నారాయణపేట పురపాలక సంఘాల్లోనూ భూగర్భ మురుగు వ్యవస్థను ఎవరూ పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం నాగర్‌కర్నూల్‌లోని పురపాలికలోనే మూడు నెలల నుంచి రూ. 64 కోట్ల నిధులతో ఈ పనులు కొనసాగుతున్నాయి. ఆయా పురపాలక సంఘాల అధికారులు, ప్రజాప్రతినిధులైనా స్పందించి భూగర్భ మురుగు వ్యవస్థ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపుతూ నిధుల మంజూరుకు కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు.

 రాష్ట్రంలోని అన్ని పురపాలక సంఘాల్లో భూగర్భ మురుగు వ్యవస్థను ఏర్పాటు చేస్తామని రెండేళ్ల క్రితం అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. దీనికి అవసరమైన నిధులను సమకూర్చుతూ పురపాలికలను ఆధునికీకరిస్తామని 2017, జులైలో ఆయన హామీ ఇచ్చారు. ఇందులో భాగంగానే నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలోని పురపాలికలో భూగర్భ మురుగు వ్యవస్థ కోసం రూ.64 కోట్లు మంజూరు చేశారు. ఉమ్మడి జిల్లాలోని మిగిలిన నాలుగు జిల్లా కేంద్రాల్లోని పురపాలక సంఘాల్లో ఈ వ్యవస్థకు సంబంధించిన ప్రణాళికలపై అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు ఉలుకూపలుకు లేకుండా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక పురపాలక సంఘాల అధికారులు భూగర్భ మురుగు వ్యవస్థ కోసం ప్రభుత్వానికి కనీసం ప్రతిపాదనలనూ పంపించలేదు. దీంతో.. ఇప్పట్లో భూగర్భ మురుగు వ్యవస్థ కార్యరూపం దాల్చే అవకాశం లేదని మహబూబ్‌నగర్‌, జోగులాంబ గద్వాల, వనపర్తి, నారాయణపేట పురపాలక సంఘాల్లోని ప్రజలు పేర్కొంటున్నారు.ఉమ్మడి పాలమూరు జిల్లాలోని వివిధ పురపాలక సంఘాల్లో భూగర్భ మురుగు వ్యవస్థ ప్రతిపాదనల్లోనే నానుతోంది. గద్వాల పురపాలికలో ఈ వ్యవస్థ కోసం 2012- 13లో అప్పటి మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి ప్రతిపాదించారు. తరవాత ఈ ప్రతిపాదనను పట్టించుకున్న వారే కరవయ్యారు. అప్పటి ముఖ్యమంత్రులు నారా చంద్రబాబునాయుడు, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పురపాలిక ఎన్నికల ప్రచారంలో భాగంగా వనపర్తి వచ్చినపుడు భూగర్భ మురుగు వ్యవస్థను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఆ ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు ఈ హామీని అమలుచేయలేదని వనపర్తి పుర ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహబూబ్‌నగర్‌, నారాయణపేట పురపాలక సంఘాల్లోనూ భూగర్భ మురుగు వ్యవస్థను ఎవరూ పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం నాగర్‌కర్నూల్‌లోని పురపాలికలోనే మూడు నెలల నుంచి రూ. 64 కోట్ల నిధులతో ఈ పనులు కొనసాగుతున్నాయి. ఆయా పురపాలక సంఘాల అధికారులు, ప్రజాప్రతినిధులైనా స్పందించి భూగర్భ మురుగు వ్యవస్థ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపుతూ నిధుల మంజూరుకు కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు.

No comments:
Write comments