డోన్ రైల్వే స్టేషన్ లో ఉద్రిక్తత

 

డోన్  ఆగస్టు 10 (globelmedianews.com - Swamy Naidu)
డోన్ పట్టణంలో రైల్వే స్టేషన్ నందు కర్నూల్ సిటీ నుండి గుంతకల్ వెళ్ళే డెమో ట్రైన్ డోన్ రైల్వే స్టేషన్ కు చేరగానే ట్రైన్ ను రైల్వే అధికారులు రద్దు  చేయడంతో  డిప్యూటీ స్టేషన్ మేనేజర్ కార్యాలయం లోపలకు వెళ్లి మహిళలు కర్నూల్ నుంచి  గుంతకల్ కు టికెట్ తీసుకొని ప్రయాణిస్తున్న మని డోన్ రైల్వేస్టేషన్లు మార్గ మధ్యలో వచ్చినాక ట్రైన్ రద్దు చేశారని అడగడంతో రైల్వే అధికారులకు, ప్రయాణికులకు ఉద్రిక్తత నెలకొంది. 
 డోన్ రైల్వే స్టేషన్ లో  ఉద్రిక్తత
దాంతో ప్రయాణికులు కాచిగూడ నుండి  మధురై వెళ్లే  ఎక్స్ ప్రెస్ రైలు ను వెళ్లకుండా పట్టాలపై ప్రయాణికులు  బైఠాయించి తమకు గుంతకల్ వెళ్లడానికి ట్రైన్ ఏర్పాటు చేసేంత వరకు డోన్ నుంచి ఏ ట్రైన్ లను  వెల్ల నియమంటూ రైలు పట్టాలపై ప్రయాణికులు కూర్చొని ధర్నా చేయడంతో రైల్వే స్టేషన్ లో ఉద్రిక్తత జరిగింది .

No comments:
Write comments