కృష్ణదాస్.. అస్త్ర సన్యాసానికి కారణం ఏమిటీ

 

శ్రీకాకుళం, ఆగస్టు 23, (globelmedianews.com - Swamy Naidu)
ధర్మాన కృష్ణదాస్‌. బ‌హుశ ఈ పేరు నిన్న మొన్నటి వ‌రకు శ్రీకాకుళం రాజ‌కీయాల్లో త‌ప్ప రాష్ట్రం మొత్తం తెలియ‌దు. దాస్‌కు జ‌గ‌న్ మంత్రి వ‌ర్గంలో చోటు క‌ల్పించ‌డంతో ఆయ‌న పేరు రాష్ట్ర ప్రజ‌ల‌కు తెలిసింది. వాస్తవానికి ధ‌ర్మాన ప్రసాద‌రావు పేరు మాత్రమే రాష్ట్ర ప్రజ‌ల‌కు సుప‌రిచితం. ఆయ‌న నిత్యం రాజ‌కీయాల్లో ఉంటూ.. ముఖ్యంగా ప్రధాన మీడియా లో కొన‌సాగ‌డం, రెవెన్యూ మంత్రిగా చ‌క్రం తిప్పడం, వివాదాస్పద వ్యాఖ్యల‌కు దూరంగా ఉంటూ.. నిర్మాణాత్మక రాజ‌కీయాలు చేస్తార‌నే పేరు తెచ్చుకోవ‌డంతో కేవ‌లం ప్రసాద‌రావు మాత్రమే రాజ‌కీయాల్లో రాష్ట్ర వ్యాప్తంగా పేరు సంపాయించుకున్నారు.వీరిద్దరిలోనూ కృష్ణదాస్ అన్న అయితే ప్రసాద‌రావు త‌మ్ముడు. ఇద్దరూ కూడా క‌లివిడిగానే రాజ‌కీయాలు చేశారు. ఎక్కడా ఎలాంటి పొర‌పొచ్చాలు లేకుండా ముందుకు సాగిన అపూర్వ స‌హోద‌రులుగా జిల్లాలో పేరు తెచ్చుకున్నారు. 
కృష్ణదాస్.. అస్త్ర సన్యాసానికి కారణం ఏమిటీ
తొలుత కాంగ్రెస్‌లో ఉన్న ఈ ఇద్దరిలో కృష్ణదాస్‌ వైఎస్ ఫ్యామిలీతో ఎన‌లేని సంబంధం పెంచుకున్నారు. వైఎస్ మ‌ర‌ణానంత‌రం ఆయ‌న జ‌గ‌న్ జై కొట్టగా.. ప్రసాద‌రావు మాత్రం కాంగ్రెస్‌ను వీడ‌డంలో చాలా స‌మ‌యం తీసుకున్నారు. అయితే, ఎట్టకేల‌కు ఆయ‌న‌కూడా జ‌గ‌న్ చెంత‌కు చేరినా.. ఆది నుంచి కూడా ధర్మాన కృష్ణదాస్ జ‌గ‌న్‌తో సంబంధం ఏర్పరుచుకుని, ఆయ‌న కుటుంబానికి అండ‌గా నిలిచారు.ముఖ్యంగా జ‌గ‌న్ కొన్ని కార‌ణాల‌రీత్యా జైలుకు వెళ్లాల్సిన స‌మ‌యంలోనూ ధర్మాన కృష్ణదాస్ ఈ కుటుంబానికి అండ‌గా ఉన్నారు. ఎక్కడా విమ‌ర్శలు కూడా చేయ‌లేదు. ఇదే ఆయ‌న‌కు పెద్ద ప్లస్‌గా మారింది. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న త‌న ఎమ్మెల్యే ప‌ద‌విని కూడా వ‌దులుకుని ఉప ఎన్నిక‌ల‌కు వెళ్లి మ‌రీ గెలిచారు. ఆ త‌ర్వాత గ‌త ఎన్నిక‌ల్లో ఓడినా జిల్లా పార్టీ అధ్యక్షురాలిగా కృష్ణదాస్ భార్య ప‌ద్మప్రియ ఉన్నారు.ఇక తాజా ఎన్నిక‌ల్లో న‌ర‌స‌న్నపేట నుంచి గెలిచిన ధర్మాన కృష్ణదాస్ కు జ‌గ‌న్‌ మంత్రి ప‌ద‌విని కూడా క‌ట్టబెట్టారు. అయితే, ఇటీవ‌ల ఆయ‌న సంచ‌ల‌న ప్రక‌ట‌న చేశారు. తాను ప్రత్యక్ష రాజ‌కీయాల్లో ఇక‌, ఉండ‌బోన‌ని, అప్పగిస్తే.. పార్టీ ప‌నుల‌కే ప‌రిమితం అవుతాన‌ని, ఇదే త‌న‌కు తుది ఎన్నిక‌ల‌ని ప్రక‌టించారు. దీంతో అంద‌రూ ఇప్పుడు కృష్ణదాస్ ప్రక‌ట‌న‌లోని అంత‌రార్థం పై చ‌ర్చించుకుంటున్నారు.ఆది నుంచి వివాదాల‌కు దూరంగా ఉన్న ధర్మాన కృష్ణదాస్ ఇప్పుడు మంత్రిగా ఉన్నారు. వాస్తవానికి ఒక ఎమ్మెల్యేగా ఉంటే.. కేవ‌లం త‌న నియోజ‌క‌వ‌ర్గం వ‌ర‌కు మాత్రమే ప‌రిమితం అవుతారు. కానీ, మంత్రిగా రాష్ట్రం మొత్తానికి ఆ శాఖ‌కు సంబంధించి బాధ్యత వ‌హించాల్సి వ‌స్తుంది. అదేస‌మ‌యంలో అనేక ఒత్తిళ్లు, మ‌న అనుకునేవారినుంచి మొహ‌మాటాలు కూడా ఎక్కువ‌వుతాయి. ఈ క్రమంలో రాగ ద్వేషాల‌కు ప్రాధాన్యం త‌ప్పదు. అయితే, వీటికిఇప్పటి వ‌ర‌కు ధర్మాన కృష్ణదాస్ దూరంగా ఉన్నారు.ఇటీవ‌ల జ‌గ‌న్ ధర్మాన కృష్ణదాస్ కు మంత్రి ప‌ద‌వి ఇవ్వడంతో ధ‌ర్మాన అలిగిన‌ట్టు కూడా వార్తలు వ‌స్తున్నాయి. కార‌ణం ఏద‌న్నది స్పష్టంగా తెలియ‌క పోయినా ఇదే అన్నద‌మ్ముల మ‌ధ్య కాస్త గ్యాప్ పెచింద‌న్న టాక్ జిల్లాలో వినిపిస్తోంది. అన్నద‌మ్ములు కొద్ది రోజులుగా ముబావంగా ఉంటున్నార‌ని కూడా అంటున్నారు. ఈ క్రమంలో ప్రత్యక్ష రాజ‌కీయాల‌కు ఏకంగా స్వస్తి చెబుతున్నార‌ని ఆయ‌న చేసిన వ్యాఖ్యలు సంచ‌ల‌నంగా మారాయి

No comments:
Write comments