గోదావరికి మళ్ళీవరద

 

రాజమండ్రి ఆగస్టు 16, (globelmedianews.com)
భద్రాచలం వద్ద క్రమేపీ పెరుగతూ నీటిమట్టం 41.9 అడుగులకు చేరుకుంది. ఉదయం నుంచి ఇప్పటివరకూ భద్రాచలంలో  ఆరు అడుగులకు పైగా పెరిగింది. దీంతో పోలవరం ప్రాజెక్టు కాఫర్ డ్యాం ఎగువ దేవీపట్నం మండలానికి మళ్ళీ మరోసారి ముంపు ముప్పు ఏర్పాడింది. పోలవరం ప్రాజెక్టు అప్పర్ స్ట్రీమ్ గ్రామాల ఫ్రజలు అలర్ట్ గా వుండాలని ధవలేశ్వరం గోదావరి హెడ్ వర్క్స్ ఇఇ మోహనరావు ఆదేశాలు జారీచేసింది.
గోదావరికి మళ్ళీవరద

ప్రస్తుతం ధవలేశ్వరం బ్యారేజ్ నుంచి 5.23 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహాం సముద్రంలోకి విడుదల చేసింది. శుక్రవారం  సాయంత్రానికి మరో 5లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. తిరిగి మొదటి ప్రమాదస్థాయి వరకూ చేరుకునే అవకాశం వుందని అధికారుల సమాచారం. ప్రస్తుతం ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద 9అడుగుల నీటిమట్టం వుంది. బ్యారేజ్ లో 175 గేట్లను .8 మీటర్ల ఎత్తున ఎత్తివుంచారు. 

No comments:
Write comments