లారీ బోల్తా..ఇద్దరు మృతి

 

ఒంగోలు ఆగస్టు 21, (globelmedianews.com - Swamy Naidu)
ప్రకాశం జిల్లా  యర్రగొండపాలెం  మండలం మెత్తగూడా తండా టోల్ గేట్ వద్ద లారి బోల్తా పడింది. ఈ ఘటనలో  ఇద్దరు గాయం సుబ్బులు, పేద లింగయ్య మృతి  చెందారు. పది మంది కి తీవ్ర గాయాలుఅయ్యాయి.బుధవారం వేకువజామున ఈ ప్రమాదం సంభవించింది. వేగంగా వస్తున్నలారీ కి  గేదే అడ్డం వచ్చింది. 
లారీ బోల్తా..ఇద్దరు మృతి
దాన్ని  తప్పించబోయి లారీ బోల్తా పడింది.  బత్తాకాయల  కోతలకు  వెళ్లిన నలభై  మంది కూలీలతో తిరిగి  యర్రగొండపాలెం వైపు వస్తుండగా ఈ ఘటన జరిగింది. క్షతగాత్రులను 108 వాహనంలో ఎర్రగొండపాలెం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కూలీలు నర్సయ్య పాలెం, పెద్ద గుడుపాడు కు చెందిన వారు.

No comments:
Write comments