ఘనంగా సింగిరెడ్డి వర్ధంతి

 

హైదరాబాద్, ఆగష్టు 16 (globelmedianews.com - Swamy Naidu):
మాజీ ఫ్లోర్ లీడర్ హైదరాబాద్  నగర సీనియర్ రాజకీయ నాయకుడు దివంగత సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ద్వితీయ వర్దంతి మాలక్ పేట నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు.  సైదాబాద్ ప్రధాన రహదారిపై ఉన్న సింగిరెడ్డి విగ్రహానికి తెరాస ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ నివాళులు అర్పించారు. అనంతరం నియోజకవర్గం లోని వివిధ అనాధ వృధా ఆశ్రమంలలో పండ్లు పంపిణీ చేసి ప్రధాన సైదాబాద్ రహదారిపై అన్నదానం ఏర్పాటు చేశారు. 
ఘనంగా సింగిరెడ్డి వర్ధంతి
ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ మీడియా తో మాట్లాడుతూ నగర రాజకీయాలలో అజాతశత్రువు గా పెరు గాంచిన నాయకుడు సింగిరెడ్డి  రాజకీయాలకు అతీతంగా ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేసిన నాయకుడు తన బాల్య మిత్రుడైన సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డిని కోల్పోయానని విచారణ వ్యక్తం చేశారు.

No comments:
Write comments