తెలంగాణలో టిక్ టాక్ బ్యాన్ దిశగా అడుగులు

 

హైద్రాబాద్, ఆగస్టు 6, (globelmedianews.com - Swamy Naidu )
టిక్ టాక్.. ఇప్పుడు యువతలలో బాగా క్రేజ్ తెచ్చుకున్న యాప్. మరీ ముఖ్యంగా యూత్‌లో టిక్ టాక్ అనే పిచ్చి నరనరాల్లోకి ఎక్కిపోయింది. ఎప్పుడూ చూసిన టిక్ టాక్ వీడియోలు చేస్తూ చూస్తూ అందులో మునిగి తేలిపోతున్నారు యువతీ యువకులు. ఈ క్రమంలోనే అనేకమంతి తమ ఉద్యోగాలను సైతం కోల్పోయే పరిస్థితి. వయస్సుతో పనిలేకుండా ఈ పిచ్చిలో పడి లేనిపోని సమస్యలు కొని తెచ్చుకుంటుండగా.. మరికొందరు ప్రాణాలు సైతం పోగొట్టుకున్నారు.
తెలంగాణలో టిక్ టాక్ బ్యాన్ దిశగా అడుగులు
దీంతో దేశవ్యాప్తంగా వైరల్‌గా మారిన టిక్‌ టాక్‌ యాప్‌ను పలు రాష్ట్రాలు నిషేధించే పనిలో పడ్డాయి.ఈ మేరకు లేటెస్ట్ గా ఏడు రాష్ట్రాలు కేంద్రానికి ఫిర్యాదులు చేశాయి. ఆ ఏడు రాష్ట్రాల జాబితాలో తెలంగాణ రాష్ట్రం కూడా ఉంది. తెలంగాణ, తమిళనాడు, గుజరాత్‌, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌, పంజాబ్‌, కర్ణాటక రాష్ట్రాలు ఈ యాప్‌ను బ్యాన్‌ చేయాలని కోరుతూ ఇప్పటికే కేంద్రానికి లేఖలు రాశాయి. దీనిపై స్పందించిన కేంద్రం 24 ప్రశ్నలతో కూడిన నోటీసులను ఆయా యాప్‌ల కంపెనీలకు జారీ చేసింది. ఈ ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వకుంటే తగిన చర్యలు తీసుకుంటామని ఆ నోటీసుల్లో కేంద్రం సదరు కంపెనీలను హెచ్చరించింది.  ఇప్పటికే తెలంగాణలో ఆన్ లైన్ గేమ్ లకు సంబంధించి కొన్నింటిని బ్యాన్ చేసి ఉన్నారు. ఇప్పుడు టిక్ టాక్ బ్యాన్ పై ఎటువంటి నిర్ణయం వస్తుందో చూడాలి.

No comments:
Write comments