గుప్పెడు నీళ్ళ కోసం నానా తిప్పలు

 

కౌతలం  ఆగస్టు 8, (globelmedianews.com - Swamy Naidu)
మండలం పరిధిలో ని  ఎరిగేరి, తోవి గ్రామాల్లో తాగునీటి సరఫరా 15 రోజులు గా నిలిచిపోయాయి.  గ్రామస్థులు పొలాల్లో ట్యాంకు, బోర్ల ను  ఆశ్రయిస్తున్నారు. గ్రామాల్లో తాగడానికి నీరు లేక,వాడుకోవడానికి నీరు లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇలా గత మూడు నెలల నుండి ఈ సమస్యకు అధికారులు తాత్కాలిక పరిస్కారం కూడా చూపించడం లేదు అధికారులదృష్టికి గ్రామ సమస్య గ్రామస్థులఎన్ని సార్లు  తీసుకెళ్లిన ఎటువంటి ప్రయోజనం లేకపోయింది. నీటి కోసం 2,3 కిలోమీటర్ల దూరం ప్రజలు  వెళ్తున్నారు.  
వైకాపా నేతలు దాడులకు పాల్పడుతున్నారు
నీటి కోసం రాత్రి ,పగలు అని తేడా లేకుండా బోరు,నీళ్ళ ట్యాంక్ ల వద్ద  పడిగాపులు కాస్తున్నారు. త్రాగునీటి కోసం కామవరం,కౌతాళం రాజనగర్ గ్రామాలకు వెళ్తున్నారు. ఇన్ని ప్రధాన సమస్యలు ఉన్న అధికారులు పట్టించుకోకపోడం  సమస్య చూసి చూడనట్టుగా వ్యవహరిస్స్తున్నారు. ప్రజల సమస్య కు స్పందించిన  వైసీపీ కార్యకర్త వై.నీలకంఠ రెడ్డి తాత్కాలిక పరిష్కరంగా టాక్టర్ నీళ్ళట్యాంక్ ల ద్వారా ప్రజలకు నీరు అందిస్తున్నారు.గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.   అధికారులు సమస్యలను స్పందించి వెంటనే పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

No comments:
Write comments