కేశవ రెడ్డి బాధితుల అక్రమ అరెస్టులను ఖండించండి డివైఎఫ్ఐ

 

నంద్యాల ఆగస్టు 28, (globelmedianews.com - Swamy Naidu)
కేశవ రెడ్డి స్కూల్ లో పిల్లలకు చదువు చెబుతాం అనే పేరుతో కోట్లాది రూపాయలు విద్యార్థుల తల్లిదండ్రుల నుండి అక్రమంగా డిపాజిట్లు చేయించుకొని దర్జాగా జైల్లో. అన్ని రాజ భోగాలు అనుభవిస్తున్న కేశవరెడ్డి విద్యాసంస్థల ఆస్తులను జప్తు చేసి విద్యార్థుల తల్లిదండ్రులు కట్టిన డిపాజిట్లు  తక్షణమే చెల్లించాలని బుధవారం  ఉదయం కేశవ రెడ్డి స్కూల్ దగ్గర ఆందోళనకు దిగిన బాధితులు . పోలీసులు దౌర్జన్యంగా అక్రమాలు చేసి కోట్లు కొల్లగొట్టిన కేశవ రెడ్డి  తరుపున పోలీసులు వచ్చి డిపాజిట్లు కట్టిన తల్లిదండ్రులను  అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసమని యావత్ సమాజం ప్రశ్నిస్తోంది అని అన్నారు . పోలీసులు ఉన్నది అక్రమార్కులను కాపాడడానికి లేక నష్టపోయిన వారి తరఫున ఉండడానికా వారే తెలియజేయాల్సి ఉంటుందన్నారు . తక్షణమే కేశవ రెడ్డి బాధితులకు డిపాజిట్లు చెల్లించాలని లేనిపక్షంలో కేశవ రెడ్డి విద్యాసంస్థలను  నడవ నించే ప్రసక్తే లేదని బాధితులు  హెచ్చరించారు. 
కేశవ రెడ్డి బాధితుల అక్రమ అరెస్టులను  ఖండించండి  డివైఎఫ్ఐ 
కేశవ రెడ్డి బాధితులకు మద్దతు ఇవ్వడానికి వెళ్ళినా సిపిఎం జిల్లా కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి  సిపిఎం నగర కార్యదర్శి రాముడు సిపిఎం జిల్లా నాయకులు అంజిబాబు ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ప్రకాష్ డివైఎఫ్ఐ నగర కార్యదర్శి రాఘవేంద్ర లను బలవంతంగా పోలీసులు అరెస్టు చేయడం మంచిది కాదన్నారు. అంటే పోలీసులు అక్రమార్కులను కాపాడడానికి ఎంత తాపత్రయపడుతున్నారో దీన్నిబట్టే అర్థం అవుతుంది అని అన్నారు. బాధితులను మరియు వారికి మద్దతు ఇచ్చిన వాళ్లను అరెస్టు చేసిన పోలీసులు పై తక్షణమే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని  డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నగేష్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.  అక్రమార్కులను కాపాడుతున్న పోలీసుల వైఖరిని మార్చుకోకపోతే  బాధితుల అందరినీ ఏకం చేసి జిల్లా వ్యాప్తంగా ఆందోళనకు దిగాల్సి వస్తుందని  ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

No comments:
Write comments