పెద్దపల్లి జిల్లాకు అరుదైన గౌరవం

 

స్వీడన్ లో నిర్వహించే  వరల్డ్ వాటర్ వీక్ లో పాల్గోననున్న జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన
పెద్దపల్లి  ఆగస్టు 22  (globelmedianews.com)  
ఈ నెల  25 నుంచి 30 వరకు  స్వీడన్ దేశంలోని స్టాక్  హోమ్,  టెలి 2 ఎరినాలో  నిర్వహించే ప్రపంచ నీటి వారోత్సవాలలో  పాల్గోనే అరుదైన గౌరవం పెద్దపల్లి  జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన  కు లభించింది.     కేంద్ర ప్రభుత్వ  త్రాగునీటి మరియు  పారిశుద్ద్య శాఖ సెక్రటరి  పరమేశ్వర్ అయ్యర్  నేతృత్వంలో  స్వీడన్ లో జరిగే  ప్రపంచ నీటి వారోత్సవాల సదస్సుకు భారతదేశం ప్రతినిధుల బృందం హాజరవుతారు .  ఈ బృందంలో   త్రాగు నీటి మరియు పారిశుద్ద్య శాఖ  సంచాలకులు యుగల్ కిశోర్,  జార్ఖండ్  పంచాయతి  రాజ్ శాఖ సెక్రటరీ ఆరాధన పట్నాయక్, జమ్మూ కాశ్మీర్  కలెక్టర్ ఇందు  ,  పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన పాల్గోంటారు.  పెద్దపల్లి జిల్లాలో  నీటి సంరక్షణకు, భూగర్బ జలాల పెంపుదలకు  అమలు చేస్తున్న వినూత్న  కార్యక్రమాల వల్ల  ప్రపంచ నీటి వారోత్సవాలలో  పాల్గోనే దేశ బృందంలో జిల్లా కలెక్టర్  శ్రీదేవసేన కు స్థానం లభించింది.  
పెద్దపల్లి జిల్లాకు అరుదైన గౌరవం 

ముఖ్యంగా  వరుసగా రెండు సార్లు స్వచ్చ్ భారత్ మిషన్ కింద జాతీయ స్థాయి అవార్డులను  సాధించి, 1000 కిలో మీటర్ల మేర కందకాలను  తవ్వించి, ఇంటింటికి  ఇంకుడుగుంతల నిర్మించి జిల్లాను  మురికి నాళా రహిత జిల్లాగా  మలిచి, ప్రతి గ్రామంలో  సాముహిక మరుగుదొడ్లు,   సామూపిక ఇంకుడుగుంతలు  డంపింగ్   యార్డులను నిర్మించిన నేపథ్యంలో  ఈ అరుదైన గుర్తింపు పెద్దపల్లికి లభించింది.  స్వీడన్ లో నిర్వహించే సదస్సులో పాల్గోనేందుకు  జిల్లా కలెక్టర్ కు అయ్యే ప్రయాణ ఖర్చు, ఇతర ఖర్చులను   యూనిసెఫ్ సంస్థ  భరిస్తుంది.   పెద్దపల్లి జిల్లాలో  విరివిగా మొక్కలు పెంచడం, సీడ్ బాల్స్  కార్యక్రమం, ఇంటింటికి  హరిత మహాలక్ష్మి  వంటి వినూత్న   కార్యక్రమాలు చేపట్టి   పర్యావరణ  పరిరక్షణకు  పెద్ద పీట వేస్తున్న పెద్దపల్లి జిల్లాకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది.   ప్రపంచ నీటి వారోత్సవాలో పాల్గోనే జిల్లా కలెక్టర్  రాష్ట్ర ప్రభుత్వం నీటికి ఇస్తున్న ప్రాధాన్యత గురించి, తెలంగాణ రాష్ట్రం గురించి సదస్సులో  వివరించనున్నారు.    రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి పూర్తి  చేసిన  సాగునీటి ప్రాజెక్టులు,  మిషన్ భగీరథ వంటి వాటిని ప్రస్తావిస్తూ, దేశానికి  తెలంగాణ రాష్ట్రం  ఆదర్శప్రాయంగా నిలిచిందని  తెలుపనున్నారు.   ప్రతి ఇంటికి సురక్షితమైన గోదావరి, కృష్ణా జలాలను  త్రాగు  నీటిగా అందించటానికి  లక్షకు పైగా కిలో మీటర్ల మేర  పైప్  లైన్ వేసి , నిర్ణీత సమయంలో పూర్తి చేసి ప్రతి ఇంటికి నల్లా ద్వారా నీరు అందిస్తున్నామని,  మన రాష్ట్రంలో అమలు చుస్తున్న  మిషన్ భగీరథ పథకాన్ని  దేశంలోని 11 రాష్ట్రాల అధికారులు, మంత్రులు  అధ్యయనం చేసి, వారి రాష్ట్రాలలో అమలు చేయడానికి కృషి చేస్తున్నారని  కలెక్టర్  సమావేశంలో వివరిస్తారు.  ప్రపంచంలోనే అతి పెద్ద  ఎత్తిపోతల పథకం అయిన  కాళేశ్వరం ప్రాజేక్టు  ద్వారా నీటిని 100 మీటర్ల  ఎత్తు  మేడిగడ్డ  నుండి   సుమారు 600 మీటర్ల  ఎత్తులో గల కొండపోచమ్మ సాగర్ వరకు నీటిని ఎత్తిపోసే  ప్రాజేక్టును  తెలంగాణ రాష్ట్ర   ప్రభుత్వం రికార్డు సమయంలో  పూర్తి చేసిన విషయాన్ని  సైతం ఆ సదస్సులో జిల్లా కలెక్టర్ ప్రస్తావిస్తారు.  నీటి సంరక్షణకు , సమర్థవంతంగా  నది జలాలను , భూగర్బ జలాలను వినియోగించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి గురించి  కలెక్టర్ ఆ సదస్సులో వివరిస్తారు.  అదే సమయంలో నీటి సంరక్షణకు, భూగర్బ జలాలను  పెంచడానికి   పెద్దపల్లి జిల్లా యంత్రాంగం  ప్రారంభించిన వివిధ  కార్యక్రమాలు  సైతం వివరిస్తారు. స్విడన్ లోని   ప్రపంచ నీటి సదస్సులో పాల్గోనే  అరుదైన అవకాశం   జిల్లాలోని ప్రజలు , ప్రజాప్రతినిధులు, పాత్రికేయ  ప్రతినిధుల భాగస్వామ్యంతో  లభించిందని, దీనికి తనకు  సంతోషంగా ఉందని కలెక్టర్  హర్షం వ్యక్తం చేయగా,  జిల్లాలోని ప్రజాప్రతినిధులు, జిల్లా అధికార  యంత్రాంగం , ప్రభుత్వ సబ్బంది కలెక్టర్ కు అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలియజేసారు.

No comments:
Write comments