బస్సు కోసం విద్యార్థుల రాస్తారోకో

 

వనపర్తి ఆగష్టు 16 (globelmedianews.com)
వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం పొలికె పహాడ్ గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతూ శుక్రవారం ఉదయం పొలికె పహాడ్ అడ్డరోడ్డు దగ్గర విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. ఆర్టీసీ బస్సు ఉదయం వస్తే సాయంత్రం రాదని, సమయ పాలన లేదని, ఎప్పుడు వస్తుందో ఎప్పుడు రాదో తెలియడం లేదని అన్నారు. 
బస్సు కోసం విద్యార్థుల రాస్తారోకో

దీనితో విద్యార్థులు, గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.పొలికె పహాడ్ నుండి వనపర్తి కి ఆటోలో వెళ్లాలంటే 18 రూపాయలు, బస్సులో వెళ్లాలంటే11రూపాయలు చార్జీలు అవుతాయని వారన్నారు. అర గంట సేపు ధర్నా చేయడం వల్ల బస్సులు, ప్రైవేటు వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేసి విద్యార్థులను శాంతింపజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, విద్యార్థులు వేమారెడ్డి,ప్రవీణ్, కార్తీక్,రామకృష్ణ, భాస్కర్,గోపి,పులెందర్, మహేష్, కుమార్,కురుమూర్తి, వెంకటేష్, భార్గవి, శ్రీచందన తదితరులు పాల్గొన్నారు.  

No comments:
Write comments