ప్రోత్సాహమేదీ..? (ఆదిలాబాద్)

 

ఆదిలాబాద్, ఆగస్టు 21(globelmedianews.com - Swamy Naidu): జిల్లాలో ఇప్పటికే పాడి పెంపకంలో స్థిరపడి, పాలు సే రైతులు అర్హులు. జిల్లా మొత్తంలో అధికారుల లెక్కల మేరకు 76మంది రైతులు విజయ డెయిరీకి పాలు పోస్తున్నారు. ఇందులో ఇప్పటి వరకు 52 మంది రైతులకు గేదెలు కొనుగోలు చేసి ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇంకా 24 మందికి గేదెలు కొనుగోలు చేసి ఇవ్వాల్సి ఉంది. జిల్లాలో గొల్ల, కురుమ కుటుంబాలకు ఇప్పటి వరకు ప్రత్యేకంగా ఎలాంటి పథకాలు వారికి అందలేదు. తొలిసారిగా గొర్రెల పెంపకందారులను ఆదుకునేందుకు రాయితీపై యూనిట్లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా జిల్లాలో గ్రామాల వారీగా సర్వే నిర్వహించి ఆదిలాబాద్‌ జిల్లాలో 6,829 కుటుంబాలు ఉన్నట్లు గుర్తించారు. తొలివిడతలో 4,283 మందికి గొర్రెలు ఇచ్చారు. బి జాబితాలో ఉన్న వారికి ఇవ్వాల్సి ఉంది. రెండో విడతలో 4,267 యూనిట్లు పంపిణీ చేయాల్సి ఉంది. వీటిలో 714 యూనిట్లు పంపిణీ చేయగా, మిగిలిన యూనిట్లు పంపిణీ చేయాల్సి ఉంది. డీడీలు కట్టి గొర్రెల పెంపకం దారులు ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలకు అధికారులు ఎదురుచూస్తున్నారు.
ప్రోత్సాహమేదీ..? (ఆదిలాబాద్)
ఈ ఏడాది ఆలస్యంగా వర్షాలు కురవడంతో ఇప్పటివరకు చెరువుల్లో వదలాల్సిన చేపపిల్లలను ఇంకా వదలలేదు..గత మూడు విడతల్లో వదిలిని చేపపిల్లల వల్ల మత్స్యకారులు కొంత ఆదాయం పెంచుకోవడంతో ఈ ఏడాది చెరువుల సంఖ్యను పెంచి, లక్ష్యం కూడా ఎక్కువగా నిర్దేశించారు. జిల్లాలో అపారమైన నీటి వనరులు ఉన్నాయి. ప్రాజెక్టులతో పాటు అనేక చిన్ననీటి వనరులు ఉన్నాయి. ఇటీవల మిషన్‌ కాకతీయ పథకం పలు చెరువులను బాగు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత చేపల పెంపకంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. చేపపిల్లలను వందశాతం రాయితీపై సరఫరా చేసి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నీళ్లల్లో వదిలేందుకు నిర్ణయించింది. ఈ మేరకు తాజాగా 1.20 కోట్ల చేపపిల్లలను వదిలేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వం రైతులతో పాటు గొల్లకుర్మలు, మత్స్యకారులను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు అమలు చేస్తున్న పథకాలకు సంబంధిత వర్గాలు ఎదురుచూస్తున్నాయి. గొర్రెల పంపిణీ ఇప్పటికే ప్రారంభించాల్సి ఉన్నా.. ఇంకా ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాకపోవడంతో అధికారులు గొర్రెల కొనుగోలును మొదలుపెట్టలేదు. మరోవైపు కొంతమందికి బర్రెలు కొనుగోలు చేసి ఇచ్చి మిగిలిన లబ్ధిదారులకు ఇవ్వలేదు. వర్షాలు ఆలస్యంగా కురవడం, టెండర్ల ప్రక్రియలో జాప్యం కావడంతో ఈ ఏడాది ఇంకా చెరువుల్లో చేపలు వదలలేదు. ధరలు ఖరారైన ఇప్పటి వరకు చేపపిల్లలు జిల్లాకు చేరుకోలేదు. సకాలంలో చేప పిల్లలను వదిలితేనే అవి ఆశించిన మేరకు పెరుగుతాయని మత్స్యకారులు అంటున్నారు.

No comments:
Write comments