రాజీవ్ గాంధీకి నివాళులర్పించిన సోనియా గాంధీ

 

న్యూ ఢిల్లీ ఆగస్టు 20 (globelmdianews.com - Swamy Naidu):
దేశ వ్యాప్తంగా మాజీ ప్రధాని రాజీవ్గాంధీ 75వ జయంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా వీర్భూమి వద్ద ప్రముఖులు నివాళులర్పించారు. రాజీవ్గాంధీకి ఆయన సతీమణి సోనియాగాంధీ, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మాజీ ప్రధాని మన్మోహన్సింగ్, తనయుడు రాహుల్గాంధీ, కుమార్తె ప్రియాంకగాంధీ అంజలి ఘటించారు. 
రాజీవ్ గాంధీకి నివాళులర్పించిన సోనియా గాంధీ
కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆజాద్, అహ్మద్ పటేల్లు, నేతలు కూడా రాజీవ్గాంధీ స్మృతి సమాధి వద్ద నివాళులర్పించారు.  ఈ సందర్భంగా రాజీవ్ చేసిన సేవలను నేతలు స్మరించుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ  ట్వీట్టర్ ద్వారా రాజీవ్ కు నివాళులర్పించారు. 1984 నుంచి 1989 వరకు ప్రధానిగా రాజీవ్ దేశానికి అందించిన సేవలను అయన కొనియాడారు.

No comments:
Write comments