.ఓయూలో విద్యార్ధినుల నిరసన

 

హైదరాబాద్, ఆగష్టు 16 (globelmedianews.com - Swamy Naidu):
ఉస్మానియా వర్సిటీలో వసతిగృహాల్లో రక్షణ కరువైంది విద్యార్థినిలు రోడ్డుపై బైఠాయించారు.వీసీకి  వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ విద్యార్థినిలకు పూర్తి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. గురువారం ఒక గుర్తు తెలియని వ్యక్తి హాస్టల్ లోకి ప్రవేశించి కత్తితో అమ్మాయిని బెదిరించి, ఆ  విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ట్లు విద్యార్థినులు తెలిపారు.  ఇలాంటి ఘటనలు పునరావతం కాకుండా ఓయూ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు.  
ఓయూలో విద్యార్ధినుల నిరసన
దీంతో ధర్నా చేస్తున్న విద్యార్థులకు  యూనివర్సిటీ అధికారులు వచ్చి హాస్టళ్లకు కు 20 నుండి 30 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని,  హాస్టల్ కాంపౌండ్ వాల్ పెద్దదిగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.  ఇకపై ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. పోలీసు అధికారులు లేడీస్ హాస్టల్ లోకి వెళ్లి పరిశీలించారు. 

No comments:
Write comments