ఆల్ టైం రికార్డుకు బంగారం ధరలు

 

ముంబై, ఆగస్టు 8, (globelmedianews.com - Swamy Naidu)
శ్రావణమాసంలోనైనా బంగారం ధరలు దిగి వస్తాయని అనుకుంటున్న వారి ఆశలు నెరవెరడం లేదు. రోజు రోజుకు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. 10 గ్రాముల బంగారం ధర 37 వేల 935కి చేరుకుంది. ఆల్ మోస్ట్ 38వేల రూపాయలకు చేరువలో ఉంది. ఇది ఆల్ టైం రికార్డ్. అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధ ప్రభావం, స్థానికంగా కొనుగోళ్ల డిమాండ్ ఉండటంతో బంగారం ధరలు పెరగటానికి కారణాలు.2019, ఆగస్టు 07వ తేదీ బుధవారం ఒక్క రోజే 1,100 రూపాయలపైనే పెరిగింది. హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,113 పెరుగుదలతో రూ.37,935 చేరుకుంది. 
 ఆల్ టైం రికార్డుకు బంగారం ధరలు
ఇక 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,115 పెరిగి రూ.35,470కి చేరింది. 10 గ్రాముల  వెండి కూడా ఇదే బాటలో ఉంది. రూ. 650 ధర పెరిగి.. కిలో వెండి రూ. 43 వేల 670కి చేరుకుంది. పరిశ్రమలు, నాణెం తయారీలు దారులు కొనుగోలు చేస్తుండడంతో ధరలు పెరుగుతున్నాయి. స్థానికంగా డిమాండ్ రావడంతో పాటు...జరుగుతున్న పరిణామాలు ధరల పెరుగుదలకు కారణమని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. అంతర్జాతీయంగా బంగారం ధరలు ఆల్ టైం హైకి చేరుకోవడంతో బులియన్ ధరలు అధికంగా ట్రేడయ్యాయి. అమెరికా నుంచి వ్యవసాయ దిగుమతులన్నింటినీ నిలిపివేయాలని చైనా ఆదేశించడంతో బంగారం ధరలపై ప్రభావం చూపిస్తోందని హెచ్ డీఎఫ్ సీ సెక్యూర్టీస్ సీనియర్ విశ్లేషకులు తపన్ పటేల్ తెలిపారు. న్యూయార్క్‌లో బంగారం ధర ఔన్స్‌కు 1,487 డాలర్లకు చేరింది. వెండి ధర ఔన్స్‌కు 16.81డాలర్లకు పెరిగింది.

No comments:
Write comments