సిటీలో దోమలపై డ్రోన్ల యుద్దం

 

హైద్రాబాద్, ఆగస్టు 28, (way2newstv,in - Swamy Naidu)
హైదరాబాద్ నగరంలో దోమలు విజృంభిస్తున్నాయి. జనాల రక్తాన్ని తాగేస్తున్నాయి. ఆస్పత్రి పాల్జేస్తున్నాయి. మలేరియా, డెంగీ రోగాలను వ్యాపింపజేస్తున్నాయి. అయితే, దోమల నిర్మూలనకు జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు తీసుకుంటున్నా ఫలితం మాత్రం తక్కువే. నీరు నిల్వ ఉండే ప్రాంతాలపై రసాయనాలను స్ప్రే చేసి దోమలను చంపే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, చిన్నచిన్నవైతే ఓకేగానీ, చెరువులు, కుంటల్లాంటి వాటికైతే మందులు జల్లడానికి రోజులు పడుతుంది. అందుకే, దోమలన్నింటి భరతాన్ని ఒకేసారి పట్టేలా అధికారులు ఓ కొత్త ఆలోచన చేశారు. అదే ‘డ్రోన్ స్ప్రే’. ఇప్పటికే గురువారం హైదరాబాద్ మియాపూర్లోని 20 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న గురునాథం చెరువులో డ్రోన్తో మందును స్ప్రే చేశారు. అక్కడ దోమల తీవ్రత ఎక్కువగా ఉండడంతో ముందుగా ఆ చెరువలోనే డ్రోన్తో మందును కొట్టారు. దోమ‌‌‌‌ల‌‌‌‌ నివార‌‌‌‌ణ‌‌‌‌కు ఎంటమాలజీ విభాగానికి చెందిన 2,375 మంది సిబ్బంది, అధికారులు రోజూ 150 ప్రాంతాల్లో 150 పోర్టబుల్, 10 ఫాగింగ్ మెషీన్లతో మందును కొడుతున్నారు.
సిటీలో దోమలపై డ్రోన్ల యుద్దం
చెరువుల్లో గుర్రపు డెక్కను తొలగించి రసాయనాలను స్ప్రే చేస్తున్నారు. యాంటీ లార్వా మందుతో దోమలతో పాటు గుర్రపుడెక్కనూ నివారించే అవకాశముంది. ప్రస్తుతం సిటీలోని శేరిలింగంపల్లి జోన్తో పాటు పలు చెరువులు, మూసీ నదిలోనూ యాంటీ లార్వా మందును డ్రోన్ల సాయంతో స్ప్రే చేయనున్నారు. దాంతో పాటే దోమల లార్వాకు కారణమవుతున్న ఇతర నీటి నిల్వ ప్రాంతాలనూ రోజూ 650 ఎంటమాలజీ బృందాలు గుర్తించే పనిలో ఉన్నాయి. 1.4 లక్షల ఇళ్లలో ఇంటింటి తనిఖీలు చేస్తున్నాయి. దోమలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో లార్వా నివారణ మందును స్ప్రే చేయిస్తారు. అంతేగాకుండా ఈ నెల 7న చెరువుల్లో గుర్రపు డెక్కను తొలగించే చర్యలనూ తీసుకున్నారు.ఓవ‌‌‌‌ర్హెడ్ ట్యాంకులు, సంపులు, నల్లా గుంతలతో పాటు డ్రమ్ములు, డబ్బాలు, కుండలు, టైర్లలో నిల్వ ఉన్న నీటిని తొలగిస్తారు.గ‌‌‌‌తంలో డెంగీ, మ‌‌‌‌లేరియా కేసులు న‌‌‌‌మోదైన బ‌‌‌‌స్తీల్లో దోమల నివారణకు ముందస్తు చర్యలు. ఆయా ప్రాంతాలకు జియోట్యాగింగ్ చేసి ఎప్పటికప్పుడు పరిశీలిస్తారు. దోమల వల్ల కలిగే నష్టాలపై స్కూల్ స్టూడెంట్లకు అవగాహన కలిగిస్తారు.అత్తాపూర్ నుంచి చాద‌‌‌‌ర్ఘాట్ వరకు మూసీకి రెండు వైపులా 126 మంది సభ్యులున్న 42 లార్వా నిరోధక బృందాలతో రసాయనాల స్ప్రే, వ్యర్థాల తొలగింపు.మై జీహెచ్ఎంసీ యాప్, డ‌‌‌‌య‌‌‌‌ల్ 100, జీహెచ్ఎంసీ కాల్సెంట‌‌‌‌ర్, ఈ–-మెయిల్‌‌‌‌, వాట్సాప్లలో వచ్చే దోమల బెడద, అంటువ్యాధులపై వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించడం.ప్రతి శుక్రవారం డ్రై డేగా పాటించడం.

No comments:
Write comments