కాలుష్యం కోరల్లో మున్నేరు

 

ఖమ్మం, ఆగస్టు 2, (globelmedianews.com - Swamy Naidu)
ఖమ్మం గ్రామీణ మండలంలోని రాజీవ్‌గృహకల్ప, నాయుడుపేట, జలగంనగర్‌ వద్ద మున్నేటిలోకి మురుగునీటిని వదలడమే కాకుండా ఆయా ప్రాంతాలోని చెత్తను కూడా తీసుకొచ్చి పడేస్తుంటారు. ఖమ్మంనగరంలోని దానవాయిగూడెం, ఎఫ్‌సీఐ గోదాం సమీపం, కాల్వోడ్డు, త్రీటౌన్‌ ప్రాంతం, ప్రకాశ్‌నగర్‌, శ్రీనివాసనగర్‌ సమీపంలో ఖమ్మం నగరంలోని మురుగునీరంతా కాల్వల ద్వారా మున్నేటికి చేరుతుంది. ఖమ్మం అర్బన్‌, ముదిగొండ, చింతకాని మండలాల్లో అక్కడక్కడా కొన్ని గ్రామాలలోని మురుగు నీరు వర్షం వచ్చినపుడు మున్నేటికి చేరుతుంది. ప్రకాశనగర్‌ సమీపంలోని ఇటుకబట్టీల వ్యర్థాలు కూడా మున్నేటిలోనే పడేస్తారు.మున్నేరు పరిసర ప్రాంతాల్లో ఉన్న పట్టణాలు, నగరాలు, కొన్ని గ్రామాల్లోని మురుగునీరంతా మున్నేరులోకే వదులుతున్నారు. గ్రామాల్లోని చెత్తను కూడా తీసుకొచ్చి వేస్తున్నారు. దీంతో మున్నేరు జలాలు పూర్తిగా కలుషితమవుతున్నాయి. వర్షాకాలంలో ఒక నెల రోజులు మాత్రమే మున్నేరు నిండుగా ప్రవహించి మురుగంతా కిందకు కొట్టుకుపోతుంది.


కాలుష్యం కోరల్లో మున్నేరు 


తరువాత మిగతా ఏడాదంతా మున్నేరులో ప్రవహించేది మురుగు నీరే. మురుగు నీటి వల్ల సమీపంలోని గ్రామాల్లో తాగునీటి కాలుష్యం ఏర్పడుతుంది.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 90ప్రాంతాల్లో కాలుష్య జలాలు ఉన్నట్లు కేంద్ర కాలుష్య నియంత్ర మండలి(సీపీసీబీ) ఆయా ప్రాంతాల్లో జాతీయ నీటి నాణ్యత పర్యవేక్షణ కార్యక్రమం(ఎన్‌డబ్ల్యూఎంపీ), తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి(టీఎస్‌పీసీబీ)తో కలిసి నీటి పరీక్షలు నిర్వహించారు. అక్కడ కాలుష్యం ఎక్కువగా ఉన్నట్లు తేలడంతో రాష్ట్రంలో మరో 70 ప్రాంతాలను కాలుష్య ప్రాంతాలుగా గుర్తించారు. వాటిల్లో ఖమ్మం జిల్లాలో పాలేరు రిజర్వాయర్‌, మున్నేరు ఉపనదులు ఉన్నట్లు సీపీసీబీ పేర్కొంది. దీనిలో భాగంగా మున్నేరు ఉపనదిలో కాలుష్యం ఏమాత్రం ఉందో తెలుసుకునేందుకు ఖమ్మం నగరంలోని ప్రకాశనగర్‌ వద్ద త్వరలోనే నీటి నమూనాలను సేకరించి పరీక్షించనున్నారు.మున్నేరు ఉపనది వరంగల్‌ నుంచి ఖమ్మం మీదుగా ప్రవహించి కృష్ణా జిల్లాలో కృష్ణానదిలో కలుస్తుంది. వరంగల్‌ నుంచి ఖమ్మం గ్రామీణ మండలం మంగళగూడెం సమీపంలో మున్నేరు ఉపనది ఈ జిల్లాలోకి ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి ఖమ్మం గ్రామీణం, రఘునాథపాలెం, ఖమ్మంనగరం, ఖమ్మం అర్బన్‌, ముదిగొండ, చింతకాని మండలాల మీదుగా ప్రవహిస్తుంది. చింతకాని మండలం చిన్నమండవ తరువాత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కృష్ణా జిల్లా వత్సవాయి మండలంలోని పోలంపల్లికి వెళ్తుంది. ఖమ్మం జిల్లాలో మున్నేరు ఉపనది మంగళగూడెం నుంచి చిన్నమండవ వరకు దాదాపు 25కిలోమీటర్ల దూరం  ప్రయాణిస్తుంది.బుగ్గవాగును, ఆకేరును విలీనం చేసుకుని మున్నేరు మంగళగూడెం వద్ద ఖమ్మం జిల్లాలోకి ప్రవేశించిన తరువాత ఖమ్మం గ్రామీణ మండలం పొలిశెట్టిగూడెం వద్ద బుగ్గవాగును, తీర్థాల వద్ద ఆకేరును తనలో విలీనం చేసుకొని ప్రవహిస్తుంది.డయేరియా, టైఫాయిడ్‌, అమిబియాసిస్‌, కలరా వ్యాధులు సంక్రమిస్తాయి. మనకు వచ్చే జబ్బుల్లో 90 శాతం జబ్బులు కలుషిత నీటి వల్లనే వస్తున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ ఆసుప్రతుల్లో చికిత్స పొందుతున్న రోగులలో సగం మంది నీటి సంబంధ వ్యాధులతో బాధపడుతున్న వారే. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి 15సెకన్లకు ఒక చిన్నారి నీటి సంబంధ వ్యాధితో చనిపోతుందని నిపుణులు చెబుతున్నారు. నీటి మూలంగా సంభవించిన 43 శాతం మరణాలకు అతిసారమే కారణం. వారిలో 84 శాతం మంది 14 ఏళ్లలోపు వారేనని వైద్య నిపుణులు చెబుతున్నారు

No comments:
Write comments