బీజేపీలో వైల్డ్ కార్ ఎంట్రీయేనా...

 

కడప, ఆగస్టు 20, (globelmedianesws.com - Swamy Naidu)
తెలుగుదేశం పార్టీ నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడిపోతున్నారు. అయితే వీరంతా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వస్తుందని వెళుతున్నారా? లేక ఐదేళ్ల పాటు కమలం పార్టీ నీడలో కాస్త టెన్షన్ లేకుండా గడుపుదామని వెళుతున్నారా? దీనికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నుంచి గ్రీన్ సిగ్నల్ ఉందా? అంటే అవుననే చెప్పాలి. 
బీజేపీలో వైల్డ్ కార్ ఎంట్రీయేనా...
చంద్రబాబునాయుడికి అత్యంత సన్నిహితులు, అధికారంలో ఉన్నప్పుడు ప్రాధాన్యత ఇచ్చిన వారు వరసగా పార్టీని వెళుతున్నారు.ప్రధానంగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రం పార్టీని వీడటం చంద్రబాబు అంగీకారంతోనేనని చెబుతున్నారు. తెలంగాణలో ఇక బలపడలేమని గ్రహించిన పార్టీ అధినేత బలం పుంజుకుంటున్న బీజేపీలోకి వెళ్లడమే మేలని సూచిస్తున్నట్లు ప్రచారం పార్టీలోనే ఇంటర్నల్ గా జరుగుతుంది.

No comments:
Write comments