సభ్యత్వాలు పూర్తి... ఇప్పుడు జిల్లా కమిటీలు గులాబీల్లో టార్గెట్ సీజన్

 

హైద్రాబాద్, ఆగస్టు 27, (globelmedianews.com - Swamy Naidu)
తెలంగాణ భవన్‌లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన, టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి 32 జిల్లాలకు సంబంధించిన సీనియర్ నేతలు, మెంబర్షిప్ ఇంచార్జీలు పాల్గొన్నారు. పార్టీ సభ్యత్వ నమోదు ఏ నియోజకవర్గ నుంచి, ఎంత చేశారు ,జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణాలు ఎంతవరకు వచ్చాయి అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌. పార్టీ నియోజకవర్గాల వారీగా పెట్టిన టార్గెట్ రీచ్ అయిన నేతలను అభినందించారు. మిగిలిన సభ్యత్వ నమోదు పుస్తకాలను పార్టీ కార్యాలయంలో అప్పగించాలన్నారు. త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి, ఆగస్టు 31లోగా పార్టీ జిల్లా కమిటీలను పూర్తి చేయాలని ఆదేశించారు కేటీఆర్ ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్‌కు 60 లక్షల వరకు సభ్యత్వం నమోదు అయినట్టు, పార్టీ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్ రెడ్డి వివరించారు. 
 సభ్యత్వాలు పూర్తి... ఇప్పుడు జిల్లా కమిటీలు  గులాబీల్లో టార్గెట్ సీజన్
టీఆర్ఎస్‌ను ఢీకొట్టాలని చూస్తున్న బీజేపీకి, రాష్ట్రం మొత్తం 12 లక్షల సభ్యత్వమే అయిందని గుర్తు చేశారు. ఇటు కాంగ్రెస్, బిజెపి నేతలు మున్సిపల్, జీహెచ్ఎంసి ఎన్నికలను అడ్డుకునేందుకు కుట్రపన్నుతున్నారని, కోర్టుల్లో కేసులు వేసి ఎన్నికలు జరగకుండా స్టేలు తీసుకొని తెస్తున్నారని పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికలు సకాలంలో జరగాలని టీఆర్ఎస్ పార్టీ కోరుకుంటోందన్నారు పల్లా. మరోవైపు పార్టీ కమిటీల్లో గ్రామస్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు, అన్ని విభాగాల్లో రిజర్వేషన్లు పాటించాలని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. మహిళలకు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలుకు అందరికి సముచిత భాగస్వామ్యం కల్పించాలని దిశానిర్దేశం చేశారు. చాలా కాలం తర్వాత పార్టీ కమిటీలు వేస్తుండటంతో జాగ్రత్తగా కమిటీల కూర్పు సరిచూసుకోవాలని, ఆదేశించినట్టు తెలుస్తోంది. కమిటీల ఏర్పాటుతో టీఆర్ఎస్ క్యాడర్ లో నయా జోష్ నింపవచ్చని పార్టీ అధిష్టానం భావిస్తోంది. మొత్తానికి ముంచుకొస్తున్న మున్సిపల్ ఎన్నికల తరుణంలో, పార్టీని పరుగులు పెట్టిస్తున్నారు కేటీఆర్. ఇటు సభ్యత్వాలు కొలిక్కిరావడంతో, అటు కమిటీల కూర్పులో గులాబీ నేతలు బిజీబీజీ కానున్నారు. మొత్తానికి పార్టీ కమిటీలు పూర్తి చేసుకొని మున్సిపల్ ఎన్నికలకు వెళ్లాలనేది పార్టీ వ్యూహంగా తెలుస్తోంది

No comments:
Write comments