గుత్తాకు కేబినెట్ లో పోస్టు...?

 


హైద్రాబాద్, ఆగస్టు 5, (globelmedianews.com -Swamy Naidu)
తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ త్వరలోనే జరుగుతుందని కొద్దిరోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆగస్టులోనూ ఇందుకు సంబంధించి సీఎం కేసీఆర్ ముహూర్తం కూడా ఖరారు చేశారని... కేటీఆర్, హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డితో పాటు తుమ్మల నాగేశ్వరరావును కొత్తగా కేబినెట్‌లోకి తీసుకోబోతున్నారని ప్రచారం సాగుతోంది. ప్రచారంలో ఉన్న పేర్ల సంగతి ఎలా ఉన్నా... తాజాగా మరో నాయకుడికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం ద్వారా ఆయనను త్వరలోనే కేసీఆర్ మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నారని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎమ్మెల్సీ యాదవరెడ్డిపై అనర్హత వేటు పడటంతో జరుగనున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున పోటీ చేసే అవకాశం గుత్తా సుఖేందర్ రెడ్డికి కల్పించారు సీఎం కేసీఆర్.ఈ ఎన్నికల్లో గుత్తా సుఖేందర్ రెడ్డి గెలుపు దాదాపు లాంఛనమే.
 గుత్తాకు కేబినెట్ లో పోస్టు...?
అయితే గుత్తాకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన కేసీఆర్... త్వరలోనే ఆయనను కేబినెట్‌లోకి తీసుకుంటారని టీఆర్ఎస్ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. మూడుసార్లు ఎంపీగా ఎన్నికైన గుత్తా సుఖేందర్ రెడ్డికి మంత్రి కావాలనే కోరిక ఎప్పటి నుంచో ఉంది. ఈ కారణంగానే ఆయన గత లోక్ సభ ఎన్నికల్లో నల్లగొండ నుంచి టీఆర్ఎస్త రపున పోటీ చేసేందుకు నిరాకరించారు. కేసీఆర్ సైతం గుత్తాను ఎమ్మెల్సీ చేసి కేబినెట్‌లోకి తీసుకుంటానని హామీ ఇచ్చినట్టు చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది.త్వరలోనేమంత్రివర్గ విస్తరణ జరుగుతుందని ఊహాగానాలు వస్తుండటం... ఈ సమయంలోనే గుత్తాకు ఎమ్మెల్సీ పదవి దక్కనుండటం ప్రాధాన్యత సంతకరించుకుంది. గుత్తాను కేబినెట్‌లోకి తీసుకునేందుకే కేసీఆర్ ఆయనకు ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇస్తున్నారనే టాక్ కూడా పొలిటికల్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. అయితే ఇప్పటికే ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి కేసీఆర్‌కు సన్నిహితుడైన జగదీష్ రెడ్డి మంత్రిగా ఉండటంతో... గుత్తాకు ఛాన్స్ ఉంటుందా అన్నది ఆసక్తికరంగా మారింది

No comments:
Write comments