రైలు పట్టాలు ధ్వంసం..పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

 

పలు రైళ్లు రద్దు..దారి మళ్లింపు 
విజయనగరం, ఆగస్టు 7 (globelmedianews.com)
ఆంధ్రా సరిహద్దు ఒడిశా రాష్ట్రంలోని అంబోదల దోయికళ్ళు రైల్వేస్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఎగువ ఒడిశాలో కురిసిన భారివర్షాల వల వరద నీటికి పట్టాలు ద్వంసం అవ్వడం వల్ల ప్రమాదం జరిగినట్టు అధికారులు గుర్తించారు. ఈ నేపధ్యంలో పలు రైళ్ల రదద్దు చేస్తున్నట్టు రైల్వే అధికారులు ప్రకటించారు. ట్రాక్ పునరుద్ధరించెంత వరకు రైళ్లు రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసారు.
రైలు పట్టాలు ధ్వంసం..పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

దీంతో ఎనిమిది రైళ్లు రద్దు కాగా మరో ఐదు రైళ్లను దారిమళ్లించారు. సంబల్ పూర్- కొరపుట్ ప్యాసింజర్,  కొరపుట్-సంబల్ పూర్ ప్యాసింజర్,  సంబల్ పూర్-జనఘర్ రోడ్ ప్యాసింజర్, జనఘర్-సంబల్ పూర్ ప్యాసింజర్, రాయపూర్-విశాఖ ప్యాసింజర్, విశాఖ-రాయ్పూర్ ప్యాసింజర్, సంబల్ పూర్-రాయగడ ఎక్స్ ప్రెస్,  రాయగడ-సంబల్ పూర్ఎక్స్ ప్రెస్ లను రద్దు చేసారు.  పూరి-ఆహ్మదాబాద్ ఎక్స్ ప్రెస్, ఆహ్మదాబాద్ _పూరి ఎక్స్ ప్రెస్,బెంగళూరు-హతియా ఎక్స్ ప్రెస్, ధనబాద్-అలప్పి ఎక్స్ ప్రెస్,  విశాఖ-నిజాముద్దీన్ సమతా ఎక్స్ ప్రెస్ లను దారు మళ్లించారు. వీటితోపాటు మరికొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేసారు. .

No comments:
Write comments