చైన్ స్నాచింగ్ కలకలం

 

భద్రాద్రికొత్తగూడెం ఆగస్టు 10, (globelmedianews.com -Swamy Naidu)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,అశ్వారావుపేట మండలంలోని నారంవారి గూడెం కాలనీలో చైన్ స్నాచింగ్ ఘటన కలకలం రేపింది. నారంవారిగూడెం కాలనీ గ్రామానికి చెందిన బూరుగు లక్ష్మి అనే మహిళ తన ఇంటిముందు నిల్చుని ఉండగా అటుగా వచ్చిన ఓ గుర్తు తెలియని వ్యక్తి అకస్మాత్తుగా ఆమె మెడలోనుంచి మూడు కాసుల బంగారు గొలుసును లాక్కొని పరారయ్యాడు. 
 చైన్ స్నాచింగ్ కలకలం
ఏం జరిగిందో తెలుసుకునే లోపే చైన్ స్నాచర్ అక్కడినుండి పరారయ్యాడు. బాధితురాలు బూరుగు లక్ష్మీ మాట్లాడుతూ ఇంటిముందు ఉన్న తనవద్దకు ఓ గుర్తు తెలియని వ్యక్తి బైక్ పై వచ్చాడని,ఏదో అడ్రస్ అడుగుతూ తనను మాటల్లో పెట్టి మెడలో ఉన్న మూడు కాసుల బంగారు చైన్ ని లాక్కొని పరారయ్యాడని వాపోయింది.చైన్ స్నాచర్ మందలపల్లి వైపు బైక్ పై పరారవుతుండగా గ్రామస్థులు అతడిని వెంబడించారు..కానీ స్నాచర్ తెలివిగా తప్పించుకున్నాడు.  ప్రశాంతంగా ఉండే పల్లెలో ఒక్కసారిగా ఇటువంటి ఘటన జరగడంతో గ్రామస్థులు ఆందోళనకు గురవుతున్నారు.బాధితురాలి సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు..

No comments:
Write comments